పశ్చిమాసియాలో నెలకొన్న ఇరాన్ యుద్ధం కారణంగా తలెత్తిన చమురు, గ్యాస్ సంక్షోభం భారతీయ గృహాలపై నేరుగా ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో OMCs కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎకనామిక్ టైమ్స్ ప్రచురించిన కథనం ప్రకారం.. భారత ప్రభుత్వ రంగ చమురు సంస్థలు (OMCs) గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఒక కీలక మార్పును పరిశీలిస్తున్నాయి.
ప్రస్తుతం భారత్‌లో గృహ అవసరాల కోసం 14.2 కిలోల ఎల్పీజీ (LPG) సిలిండర్లను వాడుతున్నాము. అయితే, ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా గ్యాస్ దిగుమతులు తగ్గడం, దేశీయ నిల్వలు పడిపోవడంతో.. చమురు సంస్థలు ఒక వినూత్న వ్యూహాన్ని అమలు చేయాలని భావిస్తున్నాయి. దీని ప్రకారం 14.2 కిలోల సామర్థ్యం ఉన్న సిలిండర్లలో కేవలం 10 కిలోల గ్యాస్‌ను మాత్రమే నింపి వినియోగదారులకు సరఫరా చేయాలని యోచిస్తున్నాయి.

సాధారణంగా ఒక 14.2 కిలోల సిలిండర్ సగటు గృహ అవసరాలకు 35 నుండి 40 రోజుల వరకు వస్తుంది. కానీ ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో.. 10 కిలోల రిఫిల్‌ను అందించడం ద్వారా అది సుమారు ఒక నెల పాటు వస్తుందని, తద్వారా అందుబాటులో ఉన్న పరిమిత నిల్వలను ఎక్కువ మంది వినియోగదారులకు పంచవచ్చని కంపెనీలు భావిస్తున్నాయి. ఒకవేళ ఈ నిర్ణయం అమలులోకి వస్తే, cylinders ధరను కూడా ఆ మేరకు తగ్గించి, దానిపై ఎంత గ్యాస్ ఉందో తెలిపే స్టిక్కర్లను అంటిస్తారు.
భారతదేశం తన గ్యాస్ అవసరాలలో సుమారు 60 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుంది. ఇందులో దాదాపు 90 శాతం గల్ఫ్ దేశాల నుండే వస్తుంది. అయితే, ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా నౌకల రాకపోకలు యుద్ధం వల్ల స్తంభించిపోయాయి. గత వారం కేవలం రెండు నౌకలు మాత్రమే ఈ జలసంధిని దాటి భారత్‌కు చేరుకున్నాయి. సుమారు ఆరు భారతీయ గ్యాస్ ట్యాంకర్లు ఇప్పటికీ పర్షియన్ గల్ఫ్‌లోనే నిలిచిపోయాయి.
పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. దేశంలో ఎల్పీజీ సరఫరా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అందుకే అందుబాటులో ఉన్న గ్యాస్‌ను పొదుపుగా వాడుకోవాలని ప్రభుత్వం పదేపదే సూచిస్తోంది. యుద్ధం ప్రారంభమైన కొత్తలో వాణిజ్య అవసరాలకు (హోటళ్లు, పరిశ్రమలు) గ్యాస్ సరఫరాను ప్రభుత్వం నిలిపివేసింది. అయితే ఇప్పుడు వారి కార్యకలాపాలు దెబ్బతినకుండా ఉండటానికి 40 శాతం కోటాను పునరుద్ధరించింది.
ఈ అదనపు సరఫరా కారణంగా గృహ అవసరాల కోసం ఉన్న నిల్వలపై మరింత ఒత్తిడి పెరుగుతోంది. మార్చి మొదటి పక్షంలో దేశవ్యాప్తంగా గ్యాస్ వినియోగం 17 శాతం మేర తగ్గింది. ఇది సరఫరాలో ఉన్న ఇబ్బందులను స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో చమురు సంస్థలు ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా (అర్జెంటీనా మరియు అమెరికా నుండి) గ్యాస్ దిగుమతి చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి.
సిలిండర్లలో గ్యాస్ పరిమాణాన్ని తగ్గించడం అంత సులభం కాదు. దీనికోసం బాట్లింగ్ ప్లాంట్లలోని బరువు చూసే యంత్రాలను (Weighing systems) తిరిగి సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా, గ్యాస్ పరిమాణం తగ్గించడం వల్ల ప్రజల్లో అయోమయం నెలకొనే ప్రమాదం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, గ్యాస్ కొరత, ధరల అంశం రాజకీయంగా కూడా కీలకం కానుంది.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications