Petrol Price: అగ్గిపెట్టె రేటుకే లీటరు పెట్రోలు.. ఇంత చౌక ధరలు ఎక్కడంటే..?
Petrol Price: దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు సామాన్యుల జోబులకు భారీగా చిల్లు పెడుతున్నాయి. అయితే ఒక దేశంలో మాత్రం కేవలం రూ.2.38కే లీటరు పెట్రోలు దొరుకుతోందని మనలో చాలా మందికి తెలియదు.
ప్రస్తుతం ఇరాన్ దేశంలో లీటరు పెట్రోలు ధర కేవలం రూ.2.38గా ఉంది. ఇదే ప్రపంచంలో అత్యంత చౌక ధరగా తెలుస్తోంది. దీనికి ముందు ఏడాది క్రితం వెనెజువలాలో చమురు ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు లభించేంది. అయితే ఈ స్థానాన్ని తాజాగా ఇరాన్ ఆక్రమించి ప్రజలకు అత్యంత తక్కువ రేటుకు చమురు విక్రయిస్తోంది. ఇది దాదాపు ఒక అగ్గిపెట్టె ధరకు సమానం. అలాగే గ్లోబల్‌పెట్రోల్‌ప్రైసెస్.కామ్‌లో నవంబర్ 20న వెనెజువలాలో భారత కరెన్సీ ప్రకారం లీటరు పెట్రోల్ ధర రూ.2.91గా కొనసాగుతోంది.

అయితే ఇండియాలో 556 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చౌకగా పెట్రోలు అమ్ముతున్న దేశంగా కువైట్ నాలుగో స్థానంలో ఉంది. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.28.40. ఐదో స్థానంలో ఉన్న అల్జీరియాలో లీటరు పెట్రోల్ ధర రూ.28.60గా కొనసాగుతోంది. ఆరో స్థానంలో ఉన్న అంగోలాలో పెట్రోలు ధర లీటరుకు రూ. 29.85 కాగా, ఏడో స్థానంలో ఉన్న ఈజిప్టులో లీటర్ పెట్రోల్ ధర రూ.33.68గా ఉంది. తుర్క్‌మెనిస్తాన్ పెట్రోల్‌ను లీటర్‌కు రూ.35.69కి విక్రయించడం ద్వారా ఎనిమిదో స్థానంలో ఉంది. మలేషియా 10వ స్థానంలో ఉంది.ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.36.61గా కొనసాగుతోంది.
ఇక ప్రపంచంలో అత్యంత ఖరీదైన పెట్రోల్ ధరలు ఉన్న దేశాలను పరిశీలిస్తే.. హాంకాంగ్‌లో లీటరు రూ.258.75, మొనాకోలో లీటరు రూ.194.26, ఐస్‌లాండ్ లో రూ.188.02, నెదర్లాండ్స్ లో రూ.181.76, ఫిన్‌లాండ్ లో రూ.173.74, స్విట్జర్లాండ్ లో రూ.172.83, అల్బేనియాలో రూ.172.77, లీచ్‌టెన్‌స్టెయిన్ లో రూ.171.42, డెన్మార్క్ లో రూ.170.81, గ్రీస్ దేశంలో లీటరు ధర రూ.170.46గా కొనసాగుతోంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా సగటున లీటరు పెట్రోలు ధర రూ.111.02గా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇండియాలో రిటైల్ పెట్రోల్ లీటరు విక్రయ ధర రూ.84.10న సగటున కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో అధిక పన్నుల కారణంగా లీటరు ధర సెంచరీ దాటేసింది.


Click it and Unblock the Notifications