ప్రపంచ ఇంధన సరఫరాకు హార్ట్ వంటి హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) కేంద్రంగా ఇరాన్, అమెరికా మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారాయి. ఇజ్రాయెల్, అమెరికాతో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో.. ఇరాన్ తన వ్యూహాత్మక బలాన్ని చాటుకోవడానికి ఈ జలమార్గాన్ని ఒక ఆయుధంగా మలచుకుంది. ఈ క్రమంలో, జలసంధి గుండా ప్రయాణించే కొన్ని ప్రత్యేక నౌకల నుండి 2 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 18.8 కోట్లు) రవాణా రుసుముగా వసూలు చేయాలని Iran తీసుకున్న నిర్ణయం ప్రపంచ వాణిజ్య రంగాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ సభ్యుడు అలయెద్దీన్ బరూజెర్ది ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాల కాలం తర్వాత ఈ జలసంధిపై ఇరాన్ తన సార్వభౌమత్వాన్ని పునరుద్ధరించుకుంటోందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం యుద్ధ పరిస్థితులు నెలకొన్నందున.. దానికి అయ్యే ఖర్చులను భరించడానికి ఈ రవాణా రుసుములు వసూలు చేయడం సహేతుకమని ఇరాన్ వాదిస్తోంది. ఇది కేవలం ఆర్థికపరమైన నిర్ణయం మాత్రమే కాదని, ఇస్లామిక్ రిపబ్లిక్ యొక్క అధికారాన్ని, అంతర్జాతీయ జలమార్గాలపై తమకున్న పట్టును ప్రపంచానికి చాటిచెప్పడమే దీని ప్రధాన ఉద్దేశమని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ ఉద్రిక్తతలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన హెచ్చరికలు మరింత ఆజ్యం పోశాయి. హోర్ముజ్ జలసంధిని 48 గంటల్లోగా తిరిగి తెరవకపోతే, ఇరాన్‌లోని అతిపెద్ద విద్యుత్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేస్తామని ట్రంప్ సోషల్ మీడియా ద్వారా హెచ్చరించారు. దీనికి ఇరాన్ అంతే ధీటుగా సమాధానమిచ్చింది. తమ మౌలిక సదుపాయాలపై అమెరికా దాడికి దిగితే.. చమురు ఎగుమతులకు అత్యంత కీలకమైన ఈ జలసంధిని పూర్తిగా మూసివేస్తామని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇజ్రాయెల్ యొక్క ఇంధన వనరులు కూడా తమ క్షిపణి పరిధిలోనే ఉన్నాయని.. వాటిని ఒక్క రోజులోనే బూడిద చేయగలమని ఇరాన్ హెచ్చరించింది.
పర్షియన్ గల్ఫ్‌ను ప్రపంచంతో అనుసంధానించే ఈ చిన్న జలసంధి ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో దాదాపు 20 శాతం (ఐదో వంతు) ఈ మార్గం గుండానే వెళ్లాలి. ఇరాన్ ప్రస్తుతం తన శత్రు దేశాలకు తప్ప మిగిలిన అందరికీ ఈ మార్గం తెరిచే ఉంటుందని చెబుతున్నప్పటికీ.. అక్కడ నెలకొన్న యుద్ధ వాతావరణం, నౌకలపై దాడుల భయంతో ట్యాంకర్ల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది. ఇది భారతదేశం వంటి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ వ్యాఖ్యల ప్రకారం.. తమ ప్రాదేశిక సమగ్రతను గౌరవించే దేశాలకు ఈ మార్గం సురక్షితంగా ఉంటుంది. కానీ, అమెరికా- ఇరాన్ మధ్య సాగుతున్న ఈ 'మైండ్ గేమ్' పరస్పర బెదిరింపులు ఏ క్షణమైనా ప్రత్యక్ష యుద్ధానికి దారితీసేలా ఉన్నాయి. ఒకవేళ చర్చల ద్వారా ఈ సమస్య పరిష్కారం కాకపోతే.. ప్రపంచం మరోసారి ఇంధన సంక్షోభంలోకి నెట్టబడే అవకాశం ఉంది. ఈ పరిణామాలు కేవలం మధ్యప్రాచ్యానికే పరిమితం కాకుండా, ప్రపంచ భౌగోళిక రాజకీయ చిత్రపటాన్ని మార్చేలా కనిపిస్తున్నాయి.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన.. భారీగా తగ్గిన చమురు ధరలు.. పుంజుకున్న మార్కెట్లు..

ఇరాన్ 10-సూత్రాల కాల్పుల విరమణ షరతులు ఇవే.. శాంతి చర్చల్లో ట్రంప్ వీటిని అంగీకరిస్తారా.. యుద్ధం ఆగినట్లేనా..

హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసేసిన ఇరాన్.. ఇజ్రాయెల్ దాడులతో సంక్షోభంలోకి కాల్పుల విరమణ ఒప్పందం..

రెండు వారాల పాటు కాల్పుల విరమణ..ఇరు దేశాల మధ్య ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలు..

ఇరాన్ యుద్దం ఆగకపోతే భారత్ సంక్షోభంలోకి..సంచలన రిపోర్ట్ విడుదల చేసిన గోల్డ్‌మన్ సాచ్స్

అప్పుల కుప్పగా అమెరికా.. కొంపలు ముంచబోతున్న 1974 వ ఏడాది నిర్ణయాలు.. కియోసాకి వార్నింగ్..

చైనాతో రహస్యంగా జతకట్టిన ఇరాన్.. అమెరికాకు బిగ్ షాక్..హార్ముజ్ జలసంధి వేదికగా డాలర్ ఆధిపత్యానికి చెక్..

Iran war: హోర్ముజ్ జలసంధిపై కీలక నిర్ణయం.. ఊపిరి పీల్చుకోనున్న ఆయిల్ మార్కెట్!

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ సంచలన ప్రకటన.. అమెరికాకు బిగ్ షాక్.. ఇజ్రాయెల్ కథ కంచికి..

ఇరాన్ ప్రతిపాదనను చెత్త బుట్టలో పడేసిన ట్రంప్.. టెహ్రాన్ కోరికల జాబితాను ఆమోదించే ప్రసక్తే లేదన్న వైట్ హౌస్..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!



Click it and Unblock the Notifications