మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. అమెరికా బలగాల మోహరింపుతో కొన్ని రోజులుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న పశ్చిమాసియా ఈ రోజు ఒక్కసారిగా భగ్గుమంది. ఇరాన్ లక్ష్యంగా అమెరికా తోడుగా ఇజ్రాయెల్ మెరుపు దాడులు చేసింది. తమ సైనిక చర్యను 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' (Operation Epic Fury)గా అమెరికా రక్షణశాఖ కార్యాలయం 'పెంటగాన్' పేర్కొంది.ఇక ఇజ్రాయెల్ దాడులను 'ఆపరేషన్ రోరింగ్ లయన్'గా ప్రధాని నెతన్యాహు అభివర్ణించారు.
అయితే ఈ దాడులు జరిగిన వెంటనే ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీ స్థాయిలో ప్రతీకార దాడులకు దిగడంతో ప్రాంతమంతా యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ నుంచి వరుసగా క్షిపణులు, డ్రోన్లు ఇజ్రాయెల్ వైపు దూసుకొచ్చినట్లు Israel Defense Forces అధికారికంగా ప్రకటించింది. ఈ పరిణామాలతో ఇజ్రాయెల్‌లో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

దాడులు ప్రారంభమైన వెంటనే ఇజ్రాయెల్‌లో అత్యవసర హెచ్చరికల కోసం ఉపయోగించే Home Front Command app ఎరుపు రంగులోకి మారింది. ఈ యాప్ ద్వారా ప్రజలకు రియల్‌టైమ్ హెచ్చరికలు, ఆశ్రయ కేంద్రాలకు వెళ్లే సూచనలు అందుతుంటాయి. Iran నుంచి ప్రయోగించిన క్షిపణులను ముందుగానే గుర్తించడంతోనే యాప్ 'రెడ్ అలర్ట్' స్థితికి వెళ్లిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఉత్తర ఇజ్రాయెల్‌తో పాటు పలు ప్రాంతాల్లో సైరన్లు మోగుతూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించాయి.
ఇరాన్ తాజా దాడులకు నేపథ్యం చూస్తే.. కొద్ది గంటల ముందే ఇజ్రాయెల్ - అమెరికా కలిసి ఇరాన్‌పై వైమానిక దాడులు చేశాయి. టెహ్రాన్‌లోని కీలక ప్రాంతాలు, ఇరాన్ సుప్రీం లీడర్ కార్యాలయాల సమీపం, అధ్యక్ష భవనం, నిఘా ప్రధాన కార్యాలయం సహా మొత్తం 30 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయని సమాచారం. ఈ దాడుల తర్వాతే ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమపై జరిగిన దాడులకు ప్రతీకారంగా డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్‌పై తొలి దశ దాడిని ప్రారంభించామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ ప్రకటించింది. ఈ దాడులు ఇక్కడితో ఆగవని, అవసరమైతే మరింత తీవ్రతరం చేస్తామని కూడా హెచ్చరించింది.
ఇజ్రాయెల్ వైపు చూస్తే.. తమ గగనతల రక్షణ వ్యవస్థలు నిరంతరం పనిచేస్తూ ఇరాన్ నుంచి వచ్చిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకుంటున్నాయని సైన్యం తెలిపింది. అయితే పరిస్థితి అత్యంత సున్నితంగా మారడంతో దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. టెల్ అవీవ్ సహా పలు నగరాల్లో సైరన్లు మోగాయి. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, బాంబ్ షెల్టర్లకు దగ్గరగా ఉండాలని అధికారులు సూచించారు. భద్రతా కారణాల వల్ల పాఠశాలలు, కార్యాలయాలు మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
ఈ దాడులపై ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి స్పందిస్తూ.. శత్రుదేశం నుంచి పొంచి ఉన్న ముప్పును నివారించేందుకే ముందస్తు దాడులు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇరాన్ అణు కార్యక్రమం, అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న అణు ఒప్పందంపై ప్రతిష్టంభన కూడా ఈ ఘర్షణలకు ప్రధాన కారణంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా సహకారంతోనే ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్ చేపట్టిందన్న వార్తలు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తున్నాయి.
తాజా పరిణామాలతో ప్రాంతీయ భద్రత పూర్తిగా దెబ్బతింది. ఇజ్రాయెల్ తన గగనతలాన్ని పౌర విమానాలకు మూసివేసింది. అదే విధంగా ఇరాన్, ఇరాక్ కూడా తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. ఇరాన్‌లో మొబైల్ ఫోన్ సేవలు నిలిచిపోవడంతో సమాచార మార్పిడి కష్టతరంగా మారింది. ఈ యుద్ధ వాతావరణం ఇంకా ఎంతవరకు విస్తరిస్తుందన్నది, ఇరాన్ తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నదానిపై ఆధారపడి ఉంటుందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

మిత్రుడు అంటూనే భారత్ మీద కత్తి దూస్తున్న ట్రంప్..ఇరాన్, రష్యాల మీద పగతో ఇండియాకు తప్పని చిక్కులు..

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన..నేనే లేకుంటే టెహ్రాన్ చేతిలో ప్రపంచం ముక్కలయ్యేదని వెల్లడి..

హార్ముజ్ జలసంధి నిండా మందు పాతరలే.. ఏ క్షణమైనా పేలే అవకాశం.. ఇరాన్ స్కెచ్‌కి ట్రంప్ ఫ్యూజులు ఔట్..

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన..హార్ముజ్ జలసంధి వేదికగా పశ్చిమాసియాలో సరికొత్త వార్..

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు..డబుల్ గేమ్ మొదలు పెట్టిన చైనా.. గగ్గోలుపెడుతున్న ట్రంప్ ..

మళ్లీ టారిఫ్ బాదుడు మొదలు పెట్టిన ట్రంప్.. ఇరాన్‌తో పాటు చైనా అంతు కూడా చూస్తామని సంచలన ప్రకటన..

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications