హార్ముజ్ జలసంధిపై ట్రంప్ సంచలన ప్రకటన.. ఇంచు కూడా తాకలేరంటూ ఇరాన్ ఘాటు రిప్లై..

అగ్రరాజ్యం అమెరికా- ఇరాన్‌తో సైనిక ఉద్రిక్తతలు, దౌత్యపరమైన వైఫల్యాలు కొనసాగుతున్న తరుణంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపాయి. న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లో జరిగిన ఒక రిపబ్లికన్ ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ.. ప్రస్తుతం సాగుతున్న సంఘర్షణలో ఇరాన్‌ను ఓడించిన తర్వాత వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన హార్ముజ్ జలసంధిని అమెరికా సొంత భూభాగంగా ప్రకటిస్తానని స్పష్టం చేశారు. లాంగ్ ఐలాండ్ వేదికగా ట్రంప్ చేసిన ఈ ప్రకటన అంతర్జాతీయంగా సముద్ర వాణిజ్య వర్గాలలో, దౌత్య వర్గాల్లో విపరీతమైన చర్చకు దారితీసింది.

ఈ ర్యాలీలో అధ్యక్ష సైనిక వ్యూహాలను వివరిస్తూ.. ప్రస్తుతం ఇరాన్ సైనిక బలగాలు తీవ్రంగా బలహీనపడ్డాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. హార్ముజ్ జలసంధిపై అమెరికా నావికాదళానికి సంపూర్ణ నియంత్రణ ఉందని, ఈ వ్యూహాత్మక జలమార్గంపై తమ ఆధిపత్యాన్ని మరింత కట్టుదిట్టం చేస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ సముద్ర మార్గంలో ఇరాన్‌ను నియంత్రించడానికి అమెరికా నావికాదళం విధించిన దిగ్బంధనాన్ని ఒక చొరబడలేని ఉక్కు గోడగా ఆయన అభివర్ణించారు. ఇరాన్ విడుదల చేస్తున్న ప్రకటనలు కేవలం మాటలకే పరిమితమవుతున్నాయని.. ఆ దేశ మిలిటరీ తీవ్రంగా దెబ్బతిని ప్రతిఘటించే శక్తిని కోల్పోయిందని ఆరోపించారు.

Iran US Conflict Trump Iran Strait of Hormuz Hormuz Crisis Trump Hormuz Iran War US Iran War Strait of Hormuz News Crude Oil Prices Oil Supply Middle East Crisis Iran Trump Tensions Hormuz Blockade Trump Iran Strait of Hormuz

అయితే ట్రంప్ చేసిన ఈ ప్రకటనలను ఇరాన్ ప్రభుత్వం తక్షణమే ఖండించింది. అమెరికా అధికారులు, ట్రంప్ చేస్తున్న వాదనల్లో ఎలాంటి వాస్తవం లేదని, ట్వీట్లు లేదా బెదిరింపులతో హార్ముజ్ జలసంధిని అమెరికా ఆక్రమించలేదని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇరాన్ విధించిన షరతులను అమెరికా, అంతర్జాతీయ సమాజం ఆమోదించే వరకు హార్ముజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. జలసంధి ద్వారా నౌకాయానం ఇకపై మూసివేయబడలేదని వైట్ హౌస్ ప్రతినిధులు పదేపదే చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమాత్రం మారలేదని ఇరాన్ స్పష్టం చేయడంతో రెండు దేశాల మధ్య తీవ్ర వ్యత్యాసాలు బయటపడ్డాయి.

Also Read

హార్ముజ్ జలసంధిని పునఃప్రారంభించడంపై అమెరికా - ఇరాన్ మధ్య దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నప్పటికీ, అవి పురోగతి సాధించడంలో విఫలమవుతున్నాయి. ప్రపంచంలో సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపు 20 శాతం ఈ జలసంధి గుండానే రవాణా అవుతుంది. అటువంటి సున్నితమైన మార్గంలో ఉద్రిక్తతలు పెరగడం అంతర్జాతీయ ఇంధన మార్కెట్లను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే భద్రతా కారణాల రీత్యా అనేక వాణిజ్య చమురు నౌకలు తమ ప్రయాణ మార్గాలను మార్చుకోవడంతో సముద్ర రవాణా వ్యయం గణనీయంగా పెరిగింది.

మరోవైపు రష్యా చమురు కొనుగోళ్లపై 100 శాతం సుంకం విధించే బిల్లును అమెరికా సెనేట్ ఆమోదించడం వల్ల భారత్, చైనాల వంటి దిగుమతిదారులపై కూడా తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఏర్పడింది. అంతర్జాతీయంగా సంయమనం పాటించాలని దేశాలు పిలుపునిస్తున్నప్పటికీ.. అమెరికా నావికా దిగ్బంధనం, ఇరాన్ మొండివైఖరితో Strait of Hormuz ప్రాంతంలో తీవ్ర అస్థిరత కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+