ఇరాన్ ప్రతీకారం.. జోర్డాన్‌లో అమెరికా సైనిక స్థావరంపై బాంబుల వర్షం..

పశ్చిమాసియాలో ఆరు నెలలుగా సాగుతున్న యుద్ధం మరింత భీకర రూపాన్ని దాల్చింది. అమెరికా దళాలు ఐదు ఇరాన్ చమురు ట్యాంకర్లను ధ్వంసం చేసిన దానికి ప్రతీకారంగా.. జోర్డాన్‌లోని అల్-అజ్రాక్‌లో ఉన్న అమెరికా వైమానిక స్థావరంపై క్షిపణులతో దాడి చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) బుధవారం అధికారికంగా ప్రకటించింది. వారం రోజుల్లోనే ఇరాన్ అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం ఇది రెండోసారి కావడం ప్రాంతీయ భద్రతపై తీవ్ర ఆందోళనలను పెంచుతోంది.

ఈ తాజా దాడుల శ్రేణి అమెరికా నౌకాదళ నౌకపై ఇరాన్ క్షిపణి దాడికి యత్నించడంతో మొదలైంది. దీనికి ప్రతిస్పందనగా.. అమెరికా దళాలు మంగళవారం ఇరాన్ సరిహద్దులకు సమీపంలో ఉన్న ఐదు చమురు ట్యాంకర్లను క్షిపణులతో ధ్వంసం చేశాయి. ఈ ఘటనపై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్పందిస్తూ.. తమ నావికాదళ నౌకలపై ఇరాన్ దాడికి యత్నించిన ప్రతిసారీ భారీగా ట్యాంకర్లను నష్టపోవలసి వస్తుందని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఖార్గ్ ద్వీపం తీరంలో కూడా ఒక ట్యాంకర్‌పై దాడి జరిగినట్లు ఇరాన్ మీడియా ధృవీకరించింది.

Iran attack Jordan Iran attacks US base US base Jordan Iran US conflict Iran missile attack ballistic missiles Jordan Strait of Hormuz Hormuz crisis Strait of Hormuz impasse Iran war 2026 US Iran war Middle East tensions Iran retaliation oil prices crude oil prices Iran Jordan attack US military base Hormuz shipping crisis Iran Attack Iran US Conflict US Base Jordan Strait

ట్యాంకర్ల పతనంపై ఆగ్రహం వ్యక్తం చేసిన టెహ్రాన్, పర్షియన్ గల్ఫ్‌లోని కువైట్, బహ్రెయిన్ తీరాలలో ఉన్న అమెరికా మిత్రదేశాల చమురు నౌకలను కూడా లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. వెంటనే ఆ ఓడల్లోని సిబ్బంది ప్రాణాలు కాపాడుకోవడానికి నౌకలను విడిచిపెట్టాలని ఆదేశించింది. దీనికి కొనసాగింపుగా జోర్డాన్‌లోని అమెరికా మిలిటరీ బేస్‌పై ఇరాన్ 18 క్షిపణులను ప్రయోగించగా, వాటిని తమ వైమానిక రక్షణ వ్యవస్థల ద్వారా గాలిలోనే కూల్చివేసినట్లు జోర్డాన్ సైన్యం ప్రకటించింది.

Also Read

మరోవైపు, ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే చమురు, సహజ వాయువులో ఐదో వంతు రవాణా అయ్యే కీలకమైన హార్ముజ్ జలసంధిపై ఇరాన్ తన నియంత్రణను మరింత బిగించింది. అంతేకాకుండా, ఈ జలసంధిలో అమెరికాకు చెందిన ఒక అత్యాధునిక మానవరహిత జలాంతర్గామి డ్రోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఇరాన్ దళాలు తెలిపాయి. ఈ పరిణామాలు గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లలో తీవ్ర అలజడిని సృష్టించాయి.

హార్ముజ్ జలమార్గంలో నౌకాయానం స్తంభించడంతో పాటు చమురు సరఫరా ఆగిపోతుందనే భయాలతో అంతర్జాతీయంగా ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. బుధవారం నాటి ట్రేడింగ్‌లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు ఏకంగా $99.38కు చేరి $100 మార్కును సమీపించగా, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ధర బ్యారెల్‌కు $94.51గా నమోదైంది. ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన తగ్గకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ద్రవ్యోల్బణ పరిస్థితులు నెలకొనే ప్రమాదం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+