ఒమన్ తీరం వద్ద నౌకపై ఇరాన్ దాడి.. భారతీయుడు గల్లంతు.. 10 మంది సురక్షితం..
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్ నౌకలపై దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా ఒమన్ తీరంలోని హార్మూజ్ జల సంధి వద్ద సైప్రస్ జెండ కలిగిన వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేసింది. ఈ దాడిలో ఒక భారతీయుడు గల్లంతు అయ్యాడు. జీఎప్ఎస్ గెలాక్సీ నౌక జలసంధీ గుండా ప్రయాణిస్తున్న సమయంలో ఇరాన్ దాడి చేసింది. దీంతో నౌకలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సిబ్బంది షిప్ నుంచి సముద్రంలో దూకినట్లు వార్తలు వస్తున్నాయి. నౌకలో 11 మంది భారతీయులు ఉండగా.. ఒకరు గల్లంతు కాగా.. 10 మందిని రక్షించారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం ధృవీకరించింది.
ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. "ఈరోజు ఉదయం ఒమన్ తీరంలో వాణిజ్య నౌక GFS గెలాక్సీపై జరిగిన దాడిని మేము ఖండిస్తున్నాము. నౌకలో ఉన్న 11 మంది భారత జాతీయులలో 10 మందిని ఇప్పటివరకు రక్షించగా, ఒక భారత జాతీయుడు గల్లంతైనట్లు సమాచారం" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని తెలిపింది. గాలింపు, సహాయక చర్యల కోసం ఒమన్ అధికారులతో సమన్వయం చేసుకుంటోందని వివరించింది. ఒమన్ ప్రభుత్వం అందించిన సాయానికి ధన్యవాదాలు తెలిపింది.

ఇరాన్ సముద్ర చమురు కీలక మార్గమైన హార్ముజ్ జలసంధిని మూసివేయగా, అమెరికా కొత్తగా దాడులను ప్రారంభించింది. దీంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై కొనసాగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని భారత్ పేర్కొంది. ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించాలని, దౌత్యపరమైన పరిష్కారం కోసం కొనసాగుతున్న చర్చలను ముగించాలని కోరింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం వాణిజ్య నౌకలను, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోకూడదని భారత్ నొక్కి చెప్పింది.
హర్మూజ్ జలసంధిలో జీఎఫ్‌ఎస్ గెలాక్సీ నౌకపై ఇరాన్ దాడి చేయడంతో భారీగా మంటలు వ్యాపించాయని భారత్ తెలిపింది. దీంతో సిబ్బంది ఆ నౌకను వదిలేసి ఒక చిన్న లైఫ్‌బోట్‌లో బయటపడ్డారని వివరించింది. నౌక ఇంజిన్ రూమ్ తీవ్రంగా దెబ్బతిందని పేర్కొంది. ఈ దాడికి ప్రతికారంగా అమెరికా ఇరాన్ పై మూడు విడతలుగా దాడులు చేసింది. దాడికి గురైన నౌక ప్రయాణించే స్థాయిలో లేదని అమెరికా బలగాలు తెలిపాయి. పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ముడి చమురు ధర పెరిగితే మళ్లీ ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications