Iran effect on India: భారత కార్మికులపై ఇరాన్ దాడి ఎఫెక్ట్.. భారత ప్రభుత్వం కీలక నిర్ణయం
Iran accts Israel: కరోనా విజృంభణ తర్వాత కోలుకుంటున్న ప్రపంచంపై రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర ప్రభావం చూపింది. కొత్త సమస్యలను తీసుకొచ్చింది. అంతర్జాతీయ సరఫరా గొలుసుకు విఘాతం కలిగించింది. ఇప్పుడిప్పుడే మరోసారి ప్రపంచం యుద్ధ మేఘాల నుంచి బయటపడుతుంది అనే సమయానికి ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేసి షాక్ ఇచ్చింది. ఇదికాస్తా అక్కడ పనికోసం తరలివెళ్తున్న కార్మికులతు తలనొప్పిగా తయారైంది.
ఏప్రిల్ 13న ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేసిన తరువాత భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండవ బ్యాచ్ నిర్మాణ కార్మికులను ఇజ్రాయెల్‌కు పంపడాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని భావిస్తున్నట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. అయితే భారతీయ కార్మికులను తమ దేశ జనాభాలో భాగంగానే పరిగణిస్తున్నందున వారి గురించి ఆందోళన చెందాల్సి అవసరంలేదని, వారి భద్రతకు కట్టుబడి ఉన్నట్లు భారత్‌లో ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిలోన్ తెలిపారు.

1,500 మంది భారతీయ పౌరులను ఇజ్రాయెల్‌కు తరలించడానికి రెండు దేశాల మధ్య ఏప్రిల్ 2న ఒప్పందం కుదిరింది. మొదటి విడతలో 65 మంది అక్కడికి చేరుకున్నారు. వారికి నిర్మాణ కార్మికులుగా ఉపాధి లభిస్తుంది. కాగా ఇప్పటికే 18 వేల మందికి పైగా భారతీయులు ఇజ్రాయెల్‌లో సంరక్షకులుగా మరియు వ్యవసాయ కార్మికులుగా పనిచేస్తున్నారు.
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తదుపరి నోటీసు వచ్చే వరకు ఇరాన్ మరియు ఇజ్రాయెల్‌లకు వెళ్లవద్దని భారతీయులకు ఏప్రిల్ 12న కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికే ఆయా దేశాల్లో నివసిస్తున్న వారందరూ స్థానిక భారత రాయబార కార్యాలయాలను సంప్రదించి తమపేర్లు నమోదు చేసుకోవాలని కోరింది. కాగా గతనెలలో వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్న కేరళ యువకుడు హిజ్బుల్లా గ్రూప్ ప్రయోగించిన క్షిపణి దాడిలో మరణించడం గమనార్హం.


Click it and Unblock the Notifications