స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐకూ 15R (iQOO 15R) అధికారికంగా లాంచ్ అయింది. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ కు పేరుగాంచిన ఐకూ బ్రాండ్.. ఈసారి బ్యాటరీ, ప్రాసెసర్ విషయంలో సరికొత్త రికార్డులను సృష్టించింది. ముఖ్యంగా ఇందులోని 7,600mAh భారీ బ్యాటరీ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి ఈ ఫోన్ ఫీచర్లు ఏంటి? ఇది నిజంగానే మీరు పెట్టే ధరకి విలువైనదా? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్
iQOO 15R స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 (Snapdragon 8 Gen 5) ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 3nm ప్రాసెస్‌పై ఆధారపడి నిర్మించబడింది, అంటే మొబైల్ స్పీడ్ అద్భుతంగా ఉండటమే కాకుండా బ్యాటరీ వినియోగం కూడా చాలా తక్కువగా ఉంటుంది. గేమర్స్ కోసం ప్రత్యేకంగా ఇందులో 'సూపర్ కంప్యూటింగ్ చిప్ Q2'ను చేర్చారు. 6.59-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు గేమింగ్ , వీడియో స్ట్రీమింగ్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్తాయి.
షాకింగ్ బ్యాటరీ లైఫ్!
సాధారణంగా ఏ స్మార్ట్‌ఫోన్‌లోనైనా 5,000mAh బ్యాటరీ చూస్తుంటాం. కానీ iQOO 15R ఏకంగా 7,600mAh సిలికాన్ ఆనోడ్ బ్యాటరీతో వస్తోంది. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ, ఫోన్ కేవలం 7.9mm స్లిమ్‌గా ఉండటం విశేషం. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కేవలం 33 నిమిషాల్లోనే 50% ఛార్జింగ్ పూర్తవుతుందని కంపెనీ చెబుతోంది. ఇక ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సాధారణ వినియోగదారులకు కనీసం 3 రోజుల పాటు బ్యాటరీ వస్తుంది.
కెమెరా, ఇతర ఫీచర్లు
ఫోన్ వెనుక భాగంలో 50MP Sony LYT-700V మెయిన్ కెమెరా (OIS సపోర్ట్‌తో) , 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 32MP కెమెరాను అందించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 పై పనిచేస్తుంది. దీనికి 4 ఏళ్ల పాటు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్స్, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తాయని ఐకూ హామీ ఇచ్చింది. గూగుల్ జెమిని ఏఐ (Google Gemini AI) సపోర్ట్ వంటి అత్యాధునిక ఏఐ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
ధర, ఆఫర్లు
iQOO 15R బేస్ వేరియంట్ (8GB+256GB) ధర రూ. 44,999గా నిర్ణయించారు. మిగిలిన మోడళ్లు రూ. 47,999, రూ. 52,999 ధరకు లభిస్తాయి. లాంచ్ ఆఫర్ కింద HDFC, Axis బ్యాంక్ కార్డులపై రూ. 4,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీనివల్ల ఫోన్ ధర రూ. 40,999కే అందుబాటులోకి వస్తుంది. మార్చి 2న ఎర్లీ సేల్, మార్చి 3 నుంచి సాధారణ సేల్ అమెజాన్ , ఐకూ వెబ్‌సైట్లలో ప్రారంభం కానుంది.
ఇది కొనడం వర్తేనా? (Is it Worth Buying?)
మీరు ఒకవేళ మొబైల్ గేమింగ్ ఎక్కువగా చేసేవారైతే లేదా తరచూ ఎక్కువగా ఫోన్ వాడేవాళ్లైతే.. ఇది మీకు సెట్ అవుతుంది. ఊరికే ఛార్జింగ్ పెట్టే అవసరం లేకుండా బ్యాటరీ బ్యాకప్ ఎక్కువసేపు వస్తుంది. అలాగే మంచి పెర్ఫామెన్స్ కావాలనుకుంటే కూడా ఖచ్చితంగా iQOO 15R బెస్ట్ ఛాయిస్. మార్కెట్లో ఇతర ఫ్లాగ్‌షిప్ ఫోన్లు రూ. 60 వేలకు ఇచ్చే స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ ను ఐకూ రూ. 40 వేలకే (ఆఫర్లతో) అందించడం నిజంగా మంచి మార్కెటింగ్ వ్యూహం. ఓవరాల్ గా కెమెరా, డిస్ ప్లే సెగ్మెంట్స్ లో ఇది పర్వాలేదనిపించినా.. పెర్ఫార్మెన్స్ , బ్యాటరీ విషయంలో మాత్రం దీనికి తిరుగులేదు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications