ఈ ఏడాది 2024 భారతీయ ప్రైమరీ మార్కెట్‌కు ఒక గొప్ప సంవత్సరంగా కనిపిస్తుంది ఇంకా ఎన్నో గొప్ప అక్టీవిటిస్ చూసింది. వివిధ రంగాలకు చెందిన కంపెనీలు-టెక్నాలజీ, కన్స్యూమర్ గూడ్స్, గ్రీన్ ఎనర్జీ అండ్ ఫైనాన్సియల్ సేవలతో సహా భారత స్టాక్ ఎక్స్ఛేంజీలో సక్సెస్ ఫుల్ గా ఎంట్రీ చేసాయి.
స్విగ్గి, హ్యుందాయ్ మోటార్ ఇండియా, బజాజ్ హోసింగ్ ఫైనాన్స్, ప్రీమియర్ ఎనర్జిస్, ఫస్ట్ క్రై, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ, TBO Tek వంటి హై-ప్రొఫైల్ కంపెనీలు షేర్లను ఎక్స్ఛేంజీలలో లిస్ట్ చేశాయి అలాగే కంపెనీ వృద్ధిలో పాల్గొనేందుకు పెట్టుబడిదారులకి అవకాశం కల్పిస్తున్నాయి.

Trendlyne నుండి వచ్చిన డేటా ప్రకారం మెయిన్‌బోర్డ్ అండ్ SME క్యాటగిరిలలో 302 కంపెనీలు ఈ సంవత్సరం ఇప్పటివరకు విజయవంతంగా ఫండ్స్ సేకరించాయి, ఇది 2023లో రికార్డయిన 238 లిస్టింగ్‌ల నుండి మంచి పెరుగుదలను సూచిస్తుంది. 302 IPOలలో 204 లేదా 67.54% ప్రస్తుతం ఇష్యూ చేసిన ధరల కంటే పైగా ట్రేడ్ అవుతున్నాయి.
133 SME IPOలు 100 రెట్లు మించి సబ్‌స్క్రిప్షన్ రేట్లను సాధించాయి, వీటిలో 23 రిటైల్ సబ్‌స్క్రిప్షన్‌లలో అనూహ్యాంగా 500 రెట్లు అధిగమించి ఈ విభాగంలో భారీ రిటైల్ భాగస్వామ్యాన్ని నొక్కిచెప్పాయి.
SME స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరుస్తూ 156 IPOలు ప్రస్తుతం వాటి ఇష్యూ ధరల కంటే ఎక్కువగా ట్రేడ్ అవుతున్నాయి. ఒవైస్ మెటల్ అండ్ మినరల్ ప్రాసెసింగ్ టాప్ లో ఉండగా, దాని ఇష్యూ ధర కంటే 1,286% అధికంగా ట్రేడవుతోంది. మరోవైపు 67 IPOలు వాటి ఇష్యూ ధరల కంటే 100% అధికంగా ట్రేడింగ్ చేస్తున్నాయి, ఇది మార్కెట్ ఉత్సాహానికి స్పష్టమైన సూచిక.
మెయిన్‌బోర్డ్ సెగ్మెంట్ కూడా గొప్ప ఎక్స్పీరియన్స్ చూసింది, వివిధ రంగాలకు చెందిన 75 కంపెనీలు 2024లో షేర్ మార్కెట్‌లోకి అడుగుపెట్టాయి. ఈ సెగ్మెంట్ కూడా పెట్టుబడిదారుల డిమాండ్‌ను చూసింది, 21 IPOలు సబ్‌స్క్రిప్షన్ రేట్లను 100 రెట్లు మించి రికార్డ్ చేశాయి.
ప్రస్తుతం 48 IPOలు వాటి ఇష్యూ ధరల కంటే ఎక్కువగా ట్రేడవుతున్నాయి, వీటిలో ఎనిమిది 100% కంటే ఎక్కువ లాభాలను పొందాయి. ఇందులో జ్యోతి CNC ఆటోమేషన్ ముందుంది, దీని ఇష్యూ ధర కంటే 268% ఎక్కువగా ట్రేడవుతోంది. దీని తర్వాత KRN హీట్ ఎక్స్ఛేంజర్, రిఫ్రిజిరేషన్, ప్లాటినం ఇండస్ట్రీస్ అలాగే ప్రీమియర్ ఎనర్జీలు ఉన్నాయి, ఈ స్టాక్‌లు వాటి ఇష్యూ ధరల కంటే 140% నుండి 260% వరకు ట్రేడవుతున్నాయి.
ప్రపంచ IPO మార్కెట్‌లో ఇండియా
ఇండియా ప్రపంచ IPO ల్యాండ్‌స్కేప్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఎర్నెస్ట్ & యంగ్ ఇండియా నివేదిక ప్రకారం, క్యూ3 2024లో గ్లోబల్ లిస్టింగ్‌లలో ఇండియా 36% వాటాతో ఉంది, దింతో యునైటెడ్ స్టేట్స్‌ను కూడా అధిగమించింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications