ఎప్పటిలాగే వచ్చే వారంలో కూడా మరో పెద్ద ఐపిఒ రాబోతుంది. ఏంటంటే ఐపిఓ మార్కెట్లో త్వరలో మరో పెద్ద పబ్లిక్ ఇష్యూ ఓపెనింగ్ కోసం రెడీగా ఉంది. ఎందుకంటే దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఐపీఓను తీసుకురావాలని యోచిస్తోంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా విజయం తర్వాత LG ఎలక్ట్రానిక్స్ కూడా IPO తీసుకురావడానికి వేగంగా పని చేస్తోంది. మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం, కంపెనీ మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి IPO కోసం పేపర్స్ కూడా ఫైల్ చేసింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా దాదాపు రూ.15,000 కోట్లు సమీకరించాలన్నది దీని లక్ష్యం. ఈ IPO SEBI నుండి ఆమోదం పొందితే హ్యుందాయ్ మోటార్ ఇండియా, Paytm ఇతరులతో సహా దేశంలోని అతిపెద్ద IPOల లిస్టులో చేరుతుంది. రిపోర్ట్ ప్రకారం, ఈ కొరియన్ కంపెనీ IPOలో 10.18 కోట్ల కంటే పైగా షేర్లను ఆఫర్ చేయగలదు.
కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లియన్సెస్, HVAC సిస్టమ్‌లు, IT హార్డ్‌వేర్ అందించే LG ఎలక్ట్రానిక్స్ భారతదేశంలో పాపులర్ బ్రాండ్. ప్రపంచవ్యాప్తంగా ఎల్జీ మాతృ సంస్థ ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారులలో ఒకటి.

మోర్గాన్ స్టాన్లీ, యాక్సిస్ క్యాపిటల్, సిటీ గ్రూప్ గ్లోబల్ వంటి ప్రముఖ పెట్టుబడి బ్యాంకులు LG ఎలక్ట్రానిక్స్ IPO కోసం బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌లుగా వ్యవహరిస్తాయి. ఈ బ్యాంకులు పెద్ద ఎత్తున పబ్లిక్ ఆఫర్‌లను విజయవంతంగా నిర్వహించిన చరిత్ర ఉంది. కాగా, Kfin Technologies Limitedని రిజిస్ట్రార్‌గా నియమించారు. ఫైలింగ్ ప్రకారం, LG Electronics Inc. కంపెనీకి 100% ఈక్విటీ ఉంది, అంటే 67.87 కోట్ల కంటే పైగా షేర్స్ ఉన్నాయి.
మే 2022లో ఎల్‌ఐసి ఇష్యూ రూ. 21,000 కోట్లు దాటింది. తాజాగా ఈ రెండు కంపెనీలు మాత్రమే ఇష్యూల ద్వారా భారీగా ఫండ్స్ సమీకరించాయి. ఇవి కాకుండా, Paytm One97 కమ్యూనికేషన్స్ ఇష్యూ సైజ్ రూ. 18,300 కోట్లు.
ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఫైనాన్షియల్ ఫలితాలు కూడా బలంగా ఉన్నాయి. 30 జూన్ 2024తో ముగిసిన త్రైమాసికంలో రూ.6409 కోట్ల ఆదాయం నమోదైంది. 31 మార్చి 2024తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 21352 కోట్లు, ఇది గత ఏడాది రూ. 19868 కోట్ల కంటే ఎక్కువ. జూన్ త్రైమాసికంలో ట్యాక్స్ ఆఫ్టర్ ప్రాఫిట్ (పీఏటీ) రూ.680 కోట్లుగా నమోదైంది. FY24కి అన్యువల్ ప్రాతిపదికన లాభం రూ.1345 కోట్ల నుంచి రూ.1511 కోట్లకు పెరిగింది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications