IPL News: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న SRH ఓనర్.. దటీజ్ కావ్య మారన్
Kavya Maran: భారత్‌లో క్రికెట్‌ను ఎంతగా ప్రేమిస్తారో అందరికీ తెలిసిందే. ఇంకా చెప్పాలంటే ఆరాధిస్తారు అనడం కరెక్టేమో. జాతి, కులం, మతం, ప్రాంతం, లింగ బేధాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఎంజాయ్ చేసే ఫెస్టివల్ IPL. పలువురు సెలబ్రిటీల యాజమాన్యంలో వివిధ జట్లు నువ్వా, నేనా అంటూ పోటీపడుతుంటాయి. వీటిని తిలకించడానికి ఆయా టీం ఓనర్స్ కూడా మైదానాల్లోనే కూర్చుని తమ జట్టును ఉత్సాహపరుస్తుంటారు. వారిలో ప్రముఖంగా వినిపించే పేరు కావ్య మారన్.
IPL టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) యజమానిరాలిగా కావ్య మారన్ అందరికీ సుపరిచితమే. తమ జట్టు ఆడుతున్న సమయంలో వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ, స్టాండ్స్‌లో నిలబడి ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌ను కెమెరామెన్ ఎప్పటికప్పడు క్యాప్చర్ చేస్తుంటాడు. అయితే ఆమె ఎవరు, ఏకంగా ఓ టీంను సొంతం చేసుకునే అంత డబ్బు ఎక్కడిది అని చాలా మందికి తెలియదు.

మీడియా టైకూన్ మరియు సన్ గ్రూప్ యజమాని కళానిథి మారన్ కుమార్తె ఈ కావ్య మారన్. 19 వేల కోట్లకు పైగా నికర ఆస్తులతో ఆయన 2019లో TN IIFL వెల్త్ హురున్ ఇండియన్ రిచ్ లిస్ట్‌లో అగ్రస్థానంలో నిలిచారు. కళానిథి గారాల పట్టి కావ్య మారన్ కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో SRH మరియు దక్షిణాఫ్రికా T20 లీగ్‌లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టులకు ప్రాతినిధ్యం వహిస్తూ దాదాపు 409 కోట్ల నికర సంపద కలిగి ఉన్నారు.
కేవలం క్రికెట్ టీమ్‌లకు లేడీ బాస్‌గా వ్యవహరించడమే కాకుండా, సన్ గ్రూప్ ఆధ్వర్యంలోని పలు కార్యకలాపాలను కావ్య మారన్ పర్యవేక్షిస్తుంది. అయితే క్రికెట్ మ్యాచ్‌లపై ఆసక్తితో ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ ఎప్పటికప్పుడు సోషల్ ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతుంటాయి. ఆమెను ఈ ఏడాది 'నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా'గా చెబుతారు. ఇటీవల కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో SRH ఓడిపోవడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం చూసి అమితాబ్ బచ్చన్ సైతం స్పందించారు.


Click it and Unblock the Notifications