ఐపీల్ కొత్త సీజన్ మొదలైంది. ఐపీల్ సీజన్ వచ్చిందంటే క్రికెట్ అభిమానుల్లో జాతర మొదలైనట్టే. ఎప్పటిలాగే ఎవరికీ నచ్చిన టీంకి వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు. అయితే పండుగలా జరుపుకునే ఈ ఇండియన్ ప్రీమియం లీగ్ (ఐపీఎల్) T20 క్రికెట్ మ్యాచులు సరిగ్గా రెండు నెలల పాటు కొనసాగుతుంది. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లను చూసే లక్షలాది మంది అభిమానులు ఇండియాలోనే కాదు విదేశాలలో కూడా ఉన్నారు. అయితే క్రికెట్ అనగానే గుర్తొచ్చేది చీర్ గర్ల్స్. ఈ చీర్ గర్ల్స్ ఐపీఎల్‌లో ఒక భాగం, ఎందుకంటే వీళ్ళు ప్రేక్షకులనే కాదు ప్లేయర్లను కూడా ఉత్సాహపరుస్తారు.

ఐపీఎల్‌లో చీర్‌లీడర్లు కేవలం డాన్సర్స్ మాత్రమే కాదు, మ్యాచ్ ఇన్స్పిరేషన్'కి ప్రతిరూపాలు కూడా. వీళ్ళు అటు ఆటగాళ్లను ఇంకా మైదానంలో ఉన్న ప్రేక్షకులను ఉత్సాహపరుస్తూ మ్యాచ్ వాతావరణాన్ని జోష్'తో ఉంచుతారు. చీర్లీడర్లు లేకుండా ఐపీఎల్ మ్యాచ్‌లను ఊహించడం కష్టం, ఎందుకంటే చీర్లీడర్లు మ్యాచ్ వినోదంలో భాగం. వాళ్ళు చేసే హుషారెత్తించే డాన్స్ గ్యాలరీలోని ప్రేక్షకులలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి.
కోల్‌కతాలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 18వ సీజన్ ప్రారంభోత్సవంలో బాలీవుడ్ నటి దిశా పటానీ అద్భుతమైన డాన్స్ ప్రదర్శనతో ఫ్యాన్స్'ని మంత్రముగ్ధులను చేసింది. అదేవిధంగా చీర్లీడర్ల డాన్స్ కూడా క్రికెట్ ఉత్సాహాన్ని పెంచుతుంది. ఈ మెగా T20 లీగ్ మ్యాచ్‌లలో ఫ్రాంచైజీల చీర్‌లీడర్లు ఎంత సంపాదిస్తారో తెలుసుకోవాలని చాల మందికి ఆసక్తిగా ఉంటుంది ? ప్రతి మ్యాచ్‌లో ప్లేయర్స్ సిక్స్, ఫోర్ లేదా వికెట్ తీసినపుడు చీర్లీడర్లు వేసే స్టెప్పులకు ఎంత ఇస్తారో తెలుసా ?
చీర్లీడర్లకు లభించే బెనిఫిట్స్ : ఐపీఎల్‌ను గ్లామర్‌తో నింపే చీర్‌లీడర్లందరికీ అలవెన్సులు ఇంకా మంచి మొత్తంలో జీతం లభిస్తుంది. మండే ఎండలో కూడా నృత్యం చేయడం, మోడలింగ్ చేయడం ఇంకా ప్రదర్శన ఇవ్వడం అంత సులభం కాదు. ప్రతి అడుగును, స్టెప్స్ నవ్వుతో వేయడానికి చాలా కష్టపడి చేయాలి, కాబట్టి జీతం ఉహించినంత అంతగా ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు అందుకునే జీతం చాల బెస్ట్ జీతం అని చెప్పొచ్చు.
చీర్లీడర్లకు ఎంత జీతం : మీడియా నివేదికల ప్రకారం, ఒక చీర్లీడర్ గర్ల్ సాధారణంగా మ్యాచ్‌కు రూ. 15,000 నుండి రూ. 17,000 వరకు సంపాదిస్తారు. దీనితో పాటు ఫ్రాంచైజీ వారికి హోటల్ వసతి, ఫుడ్ ఇంకా ప్రయాణ ఖర్చులను కూడా భరిస్తుంది.
ఏ ఫ్రాంచైజీ అత్యధిక జీతం చెల్లిస్తుంది : ఐపీఎల్‌లో షారుఖ్ ఖాన్ టీం కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ చీర్‌లీడర్లకు అత్యధిక మొత్తాన్ని చెల్లిస్తున్నట్లు సమాచారం. KKR చీర్లీడర్లలో ఒక్క మ్యాచ్‌కు ఒక్కరికి రూ.24,000 నుండి రూ.25,000 వరకు చెల్లిస్తుంది. టీం బాగా రాణిస్తే KKR చీర్లీడర్లకు కొన్ని బోనస్‌లు కూడా ఇస్తుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండ్ ముంబై ఇండియన్స్ జట్లు చీర్లీడర్లకు మ్యాచ్ కు దాదాపు రూ.20,000 చెల్లిస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ కూడా చీర్లీడర్లలో ఒక్కొక్కరికి మ్యాచ్‌కు రూ. 17,000 చెల్లిస్తుంది. కానీ పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు చీర్‌లీడర్లకు మ్యాచ్‌కు రూ.12,000 చెల్లిస్తున్నట్లు సమాచారం. అదనంగా జట్టు గెలిస్తే బోనస్ కూడా ఇస్తుంటుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications