ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 సీజన్‌కు సంబంధించిన మినీ వేలంకు రంగం పూర్తిగా సిద్ధమైంది. అబుదాబి వేదికగా నేడు జరిగే ఈ వేలంలో.. లీగ్‌లోని 10 ఫ్రాంచైజీలు తమ జట్లలో మిగిలిన ఖాళీలను పూరించుకునేందుకు పోటీ పడనున్నాయి. ఈ వేలంలో మొత్తం 77 ఖాళీలు ఉండగా.. 359 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో గరిష్టంగా 31 మంది విదేశీ ఆటగాళ్లను జట్లు ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే పది ఫ్రాంచైజీలు 77 స్లాట్స్ కోసం రూ. 237.55 కోట్లు వెచ్చించనున్నట్లుగా తెలుస్తోంది.
కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) వద్దనే అత్యధికంగా రూ.64.30 కోట్లు పర్స్‌లో ఉన్నాయి. ఇక వారికే అన్ని జట్ల కంటే ఎక్కువగా 13 మంది ఆటగాళ్ల అవసరం ఉంది. మరో జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జట్టులో 10 ఖాళీలు ఉండగా.. వారి చేతిలో రూ.25.50 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ పర్స్‌లో రూ. 43.40 కోట్ల నగదు ఉంది.అలాగే లక్నో (రూ. 22.95 కోట్లు), ఢిల్లీ (రూ. 21.80 కోట్లు), బెంగళూరు (రూ. 16.40 కోట్లు) కలిగి ఉన్నాయి.

వేలానికి రిజిస్టర్ అయిన ఆటగాళ్లలో 40 మంది క్రికెటర్లు రూ.2 కోట్ల కనీస ధరను నిర్ణయించుకోవడం గమనార్హం. వీరిలో ఎంతమంది ఆటగాళ్ల విలువ కనీస ధర కంటే ఎక్కువగా పెరుగుతుందన్నది క్రికెట్ అభిమానులు, నిపుణుల్లో తీవ్ర ఆసక్తిని కలిగిస్తోంది. అయితే, ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక విదేశీ ఆటగాడికి గరిష్టంగా రూ.18 కోట్లు మాత్రమే లభిస్తాయి. వేలంలో అంతకంటే ఎక్కువ మొత్తం పలికినా, అది ఆటగాడికి కాకుండా బీసీసీఐకి వెళ్లిపోతుంది. ఈ నిబంధన మెగా వేలంలో రిషభ్ పంత్‌కు వచ్చిన రూ.27 కోట్ల ఒప్పందాన్ని మించకుండా ఉండేందుకే అమలులో ఉంది.
ఈ మినీ వేలంలో కొందరు స్టార్ ఆటగాళ్లపై ప్రత్యేక దృష్టి నెలకొంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ కు భారీ డిమాండ్ ఉండే అవకాశం కనిపిస్తోంది. 2023లో ముంబై ఇండియన్స్ తరఫున అద్భుత ప్రదర్శన చేసిన గ్రీన్.. 2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఫర్వాలేదనిపించాడు. గాయం కారణంగా గత సీజన్‌కు దూరమైనప్పటికీ, అతని ఆల్‌రౌండర్ సామర్థ్యం కారణంగా జట్లు అతనిపై ఆసక్తి చూపుతున్నాయి.
ఆండ్రే రసెల్ రిటైర్మెంట్ ప్రకటించడంతో కేకేఆర్‌కు అలాంటి పవర్‌ఫుల్ ఆల్‌రౌండర్ అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది ఉంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ కూడా మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేసే ఆల్‌రౌండర్ కోసం చూస్తోంది. గత సీజన్‌లో ఆర్‌సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించిన లియమ్ లివింగ్‌స్టోన్ కూడా పెద్ద మొత్తాన్ని ఆకర్షించే అవకాశం ఉంది. విదేశీ ఆటగాళ్లలో క్వింటన్ డికాక్, మతీషా పతిరణ, జేమీ స్మిత్, డెవన్ కాన్వే, డేవిడ్ మిల్లర్, హసరంగ, ముల్డర్, నోర్జే వంటి పేర్లు కూడా జట్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.గత సీజన్లలో మెరుపులు మెరిపించిన మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్ ఈసారి వేలానికి అందుబాటులో లేకపోగా, రసెల్ రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఇక భారత క్రికెటర్ల విషయానికి వస్తే లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ కు భారీ మొత్తం దక్కే అవకాశం ఉంది. అలాగే వెంకటేశ్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, దీపక్ హుడా, ఆకాశ్‌దీప్, రాహుల్ చహర్ తదితరులు కూడా వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ వేలంలో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 17 మంది క్రికెటర్లు అందుబాటులో ఉన్నారు. వీరిలో భారత జట్టు తరఫున ఆడిన కేఎస్ భరత్ తన కనీస ధరను రూ.75 లక్షలుగా నిర్ణయించుకోగా..మిగతా ఆటగాళ్లంతా రూ.30 లక్షల కనీస ధరతో వేలంలోకి దిగుతున్నారు. హైదరాబాద్ నుంచి 9 మంది, ఆంధ్ర నుంచి 8 మంది ఐపీఎల్ అవకాశాన్ని అందుకోవాలని ఎదురుచూస్తున్నారు.
టీవీలో ప్రత్యక్ష ప్రసారం: IPL 2026 మినీ వేలాన్ని టెలివిజన్‌లో ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే ప్రేక్షకులు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ను ఆశ్రయించవచ్చు. స్టార్ స్పోర్ట్స్ తమ వివిధ ఛానళ్ల ద్వారా ఈ వేలాన్ని లైవ్‌గా ప్రసారం చేస్తుంది. హిందీ, ఇంగ్లిష్‌తో పాటు ప్రాంతీయ భాషల్లో కూడా కవరేజీ ఉండే అవకాశం ఉంది. వేలం ప్రారంభం నుంచి చివరి ఆటగాడి ఎంపిక వరకు ప్రతి కీలక ఘట్టాన్ని నిపుణుల విశ్లేషణతో పాటు స్టార్ స్పోర్ట్స్ అందించనుంది.
డిజిటల్‌లో లైవ్ స్ట్రీమింగ్ : డిజిటల్ వేదికలపై వీక్షించాలనుకునే క్రికెట్ అభిమానుల కోసం JioHotstar యాప్ మరియు వెబ్‌సైట్లో IPL 2026 వేలం ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. స్మార్ట్‌ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్ లేదా స్మార్ట్ టీవీ ద్వారా ఎక్కడ ఉన్నా సులభంగా ఈ వేలాన్ని లైవ్‌గా చూడవచ్చు. వేగవంతమైన స్ట్రీమింగ్, క్లియర్ విజువల్స్, రియల్‌టైమ్ అప్‌డేట్స్‌తో JioHotstar సమగ్ర కవరేజీని అందించనుంది.
పది ఫ్రాంచైజీలకు మిగిలిన పర్స్, స్లాట్‌ల వివరాలు
కోల్‌కతా నైట్ రైడర్స్ - రూ. 64.3 కోట్లు (13 స్లాట్లు)
చెన్నై సూపర్ కింగ్స్ - రూ. 43.4 కోట్లు (9 స్లాట్లు)
సన్‌రైజర్స్ హైదరాబాద్ - రూ. 25.5 కోట్లు (10 స్లాట్లు)
లక్నో సూపర్ జెయింట్స్ - రూ. 22.95 కోట్లు (6 స్లాట్లు)
ఢిల్లీ క్యాపిటల్స్ - రూ. 21.8 కోట్లు (8 స్లాట్లు)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - రూ. 16.4 కోట్లు (8 స్లాట్లు)
రాజస్థాన్ రాయల్స్ - రూ. 16.05 కోట్లు (9 స్లాట్లు)
గుజరాత్ టైటాన్స్ - రూ. 12.9 కోట్లు (5 స్లాట్లు)
పంజాబ్ కింగ్స్ - రూ. 11.5 కోట్లు (4 స్లాట్లు)
ముంబై ఇండియన్స్ - రూ. 2.75 కోట్లు (5 స్లాట్లు)
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications