ఐపీఎల్ ఛాంపియన్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..ఓడితే ఎంతో తెలుసా.. ఓ లుక్కేసుకోండి

IPL 2025 Prize Money: IPL 2025 తుది సమరానికి సిద్ధమైంది. ఇంకొక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. క్వాలిఫయర్ 1 లో పంజాబ్ కింగ్స్ ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ లో అడుగుపెట్టింది. రెండో మ్యాచ్ విషయానికి వస్తే.. PBKS క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. జూన్ 3న మంగళవారం అహ్మదాబాద్‌లో జరిగే గ్రాండ్ ఫైనల్‌లో RCBతో తాడో పేడో తేల్చుకోనుంది. ఇక IPL 2025 లో క్వాలిఫైయర్ 2 కి రిజర్వ్ డే లేదు. రిజర్వ్ డే నియమం కేవలం ఫైనల్ కు మాత్రమే వర్తిస్తుంది. అంటే వాతావరణం కారణంగా ఆదివారం PBKS vs MI ఆట రద్దయితే పాయింట్ల పట్టికలోని స్టాండింగ్స్ ఆధారంగా ఫలితం నిర్ణయిస్తారు.

లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన పంజాబ్ కింగ్స్... ఒక వేళ తదుపరి మ్యాచ్ పూర్తిగా వర్షం వల్ల రద్దయితే ఫైనల్‌కు అడుగుపెడుతుంది. ముంబై ఒక్క బంతి కూడా వేయకుండానే టోర్నీ నుంచి బయటకు వెళుతుంతి. ఐఎండీ అంచనాల ప్రకారం... అహ్మదాబాద్‌లో వర్షం పడే అవకాశం చాలా తక్కువగా ఉంది. కేవలం 0% నుండి 5% వరకు ఉంటుందని అంచనా. దీన్ని బట్టి చూస్తే ఈ మ్యాచ్ అనుకున్న ప్రకారం జరిగే అవకాశం ఉంది.

IPL 2025 Prize Money Revealed How Much Did the Winner Runner-up and Top Players Earn

ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన, వికెట్లు తీసిన ఆటగాడికి అందజేసే ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ గుర్తింపుతో పాటు మంచి జీతం లభిస్తుంది ఆటగాళ్లకు.. ఇది కేవలం ప్రతిష్ట గురించి మాత్రమే కాకుండా.. ఈ సంవత్సరం గెలిచిన జట్టు రూ. 20 కోట్లు. రన్నరప్ రూ. 13 కోట్లు ఇంటికి తీసుకువెళుతుంది. ప్లేఆఫ్‌లో ఓడిపోయిన ఇద్దరు కూడా ఒట్టి చేతులతో ఇంటికి వెళ్లరు. వారికి కూడా నగదు ఇస్తారు.

2008 విషయానికి వస్తే ఆ ఏడాది IPL ఛాంపియన్లు రూ. 4.8 కోట్లు ఫ్రైజ్ మనీ గెలుచుకున్నారు. ఇక రన్నరప్ జట్టు అందులో సగం తీసుకుంది. పదిహేడు సంవత్సరాల తర్వాత ఈ ఏడాది లీగ్ పెద్దదిగా ఉండటమే కాకుండా, అత్యధిక పారితోషికాలతో పాటుగా భారీ ప్రైజ్ మనీతో జరుగుతోంది.

IPL 2025: విజేత, రన్నరప్ ప్రైజ్ మనీ విషయానికి వస్తే ఐపీఎల్ గవర్నింగ్ కమిటీ ఇంకా అధికారికంగా గణాంకాలను ప్రకటించాల్సి ఉంది. అయితే ఐపీఎల్ ఛాంపియన్లు రూ. 20 కోట్లు ఈ ఏడాది అందుకోనున్నారు. అలాగే రన్నర్స్ రూ. 13 కోట్లు కోట్లు అందుకోనున్నారు. ఇక క్వాలిఫైయర్ రూ. 7 కోట్లు, ఎలిమినేటర్ రూ. 6.5 కోట్లు బహుమతి అందుకోనున్నారు.

IPL 2025: వ్యక్తిగత అవార్డు బహుమతి డబ్బు పంపిణీ : అ ఏడాది ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు కూడా భారీగా బహుమతులు అందనున్నాయి. ఆరెంజ్ క్యాప్ అందుకున్న ఆటగాడికి రూ. 10 లక్షలు అలాగే పర్పుల్ క్యాప్ అందుకున్న ఆటగాడికి రూ. 10 లక్షలు బహుమతి ఇవ్వనున్నారు. ఇక ఎమర్జింగ్ ప్లేయర్ కి రూ. 20 లక్షలు, అత్యంత విలువైన ఆటగాడకి 10 లక్షలు, సూపర్ స్ట్రైకర్ కి 10 లక్షలు, పవర్ ప్లేయర్ కి 10 లక్షలు ఇవ్వనున్నారు. అత్యధిక సిక్సులు కొట్టిన వారికి రూ. 10 లక్షలు, గేమ్ ఛేంజర్ కి 10 లక్షలు ఇవ్వనున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+