ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. టాప్ బ్రాండ్లను కూడా లాగేస్తున్న క్రికెట్ ?

ఐపిల్ క్రేజ్ ప్రతి ఏడాదికి ఏ మాత్రం తగ్గకుండా పెరుగుతూ వస్తుంది. ఒకప్పుడు క్రికెట్ అభిమానులకు పండుగ సీజన్ల ఉండే ఐపీఎల్ ఇప్పుడు అడ్వాటైజింగ్ ఇంకా బ్రాండ్ ప్రోమోషన్స్ సలహా డీజిటల్ ప్లాట్‌ఫామ్‌స్లో కూడా పోటీ ఏర్పడుతుంది. దింతో క్రికెట్ ఇకపై కేవలం ఒక ఇష్టం కాదు, ఒక పెద్ద వ్యాపారంగా కూడా మారింది. దీనికి తోడు ఇండియా కూడా ప్రస్తుతం ఒక ప్రధాన ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. వీటన్నిటికంటే ఇంటెర్నేషనల్ బ్రాండ్లు కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడానికి ఐపీఎల్ వంటి ప్లాట్‌ఫామ్‌స్ ఒక మార్గంగా మారాయి. ఇవి వ్యూవర్షిప్ రికార్డ్స్ కూడా బ్రేక్ చేస్తున్నాయి. 2025లో టీవీ, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, టీం స్పాన్సర్‌షిప్‌లు, ఆన్-ఫీల్డ్ యాడ్స్ ద్వారా అడ్వాటైజింగ్ ఆదాయం దాదాపు రూ.6,000-7,000 కోట్లు ఉంటుందని అంచనా. అయితే భారతదేశంలో బిజినెస్ పెంచుకోవడానికి చాల అంతర్జాతీయ బ్రాండ్లు జియోస్టార్ క్రికెట్ బ్రాడ్ కాస్ట్, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి.

IPL 2025 advertising revenue expected to reach 6 000 to Rs 7 000 crores these top brands entering into Indian market

రియల్ ఎస్టేట్ కంపెనీ డాన్యూబ్ ప్రాపర్టీస్ & పెర్ఫ్యూమ్ బ్రాండ్ లట్టాఫా పెర్ఫ్యూమ్స్ వంటి పెద్ద పేర్లు కూడా అడ్వాటైజర్స్ లిస్టులో చేరాయి. అంతర్జాతీయ కంపెనీలు భారత మార్కెట్‌ను ఎలా ఫోకస్ చేస్తున్నాయో దీని బట్టి తెలుస్తుంది. డానుబే ప్రాపర్టీస్ స్టార్ స్పోర్ట్స్‌లో 'కో-పవర్డ్ బై' స్పాన్సర్‌గా మారగా, లట్టాఫా పెర్ఫ్యూమ్స్ జియోస్టార్ క్రికెట్ కవరేజీపై అడ్వాటైజ్ చేసిన మొదటి అంతర్జాతీయ బ్రాండ్‌గా అవతరించింది. ఐపీఎల్ ఇప్పుడు భారతీయ బ్రాండ్లకు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారాలకు కూడా ఒక పెద్ద వాణిజ్య కేంద్రంగా మారింది.

గత కొన్ని సంవత్సరాలుగా జియోస్టార్ ఐపీఎల్ ప్లాట్‌ఫామ్‌పై అంతర్జాతీయ పార్టనర్షిప్స్ పెరిగాయి. ఎమిరేట్స్, ఎతిహాద్, టర్కిష్ ఎయిర్‌లైన్స్, ఖతార్ ఎయిర్‌వేస్ వంటి ప్రముఖ విమానయాన సంస్థలు ఇంకా సౌదీ అరేబియా, మలేషియా టూరిజం బోర్డులు కూడా IPL ద్వారా ప్రీమియం ట్రావెల్ & లైఫ్ స్టయిల్ ప్రొడక్ట్స్ ప్రోత్సహించాయి.

ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ : ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ ప్రస్తుతం 12 బిలియన్ డాలర్లకు చేరుకుంది. CSK, MI, RCB & KKR నాలుగు టీంలు $100 మిలియన్లకు పైగా బ్రాండ్ వాల్యూతో ఉన్నాయి. ఒక నివేదిక ప్రకారం, IPL 2025 మొదటి 13 మ్యాచ్‌లలో కమర్షియల్ యాడ్స్ 12% పెరిగింది.

80 కోట్లకు పైగా స్పోర్ట్స్ లవర్స్ : భారతదేశంలో 80 కోట్లకు పైగా క్రీడా ప్రేక్షకులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది 25 నుండి 45 సంవత్సరాల వయస్సు గలవారే. చిన్న పట్టణాల్లో కూడా ప్రజలు ఇప్పుడు బ్రాండెడ్ వస్తువులను కొనాలనుకుంటున్నారు. అందువల్ల, అంతర్జాతీయ కంపెనీలు ఈ నగరాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి.

ఐపీఎల్ మ్యాచ్‌లను టీవీ, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ రెండింటిలోనూ చూస్తుంటారు. అందువల్ల ఈ టోర్నమెంట్ బ్రాండ్‌లకు పెద్దగా ఖర్చు చేయడానికి అవకాశాన్ని ఇస్తుంది. అంతేకాక ఈ బ్రాండ్లు రెండు నెలల్లోనే ఎక్కువ మందిని చేరుకోగలవు. IPL అనేది బ్రాండ్లు వాటి గుర్తింపును సృష్టించుకుని, ఉత్పత్తులతో ప్రజలను చేరుకోగల ఓ వేదిక. భారతదేశంలో వ్యాపారం చేయడానికి ఐపీఎల్ ఒక గొప్ప అవకాశం.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+