I Phone Prices: వారికి శుభవార్త.. తగ్గిన ఐ ఫోన్ ధరలు..
ఐ ఫోన్ కొనాలనుకునే వారికి శుభవార్త. ఇప్పుడు ఐ ఫోన్ ధరలు తగ్గాయి. జూలై 23న సమర్పించిన బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొబైల్ ఫోన్లు, ఛార్జర్లను చౌకగా చేస్తామని ప్రకటించారు. ఆపిల్ తన కస్టమర్లకు ఈ ప్రయోజనాన్ని అందించిన మొదటి కంపెనీగా అవతరించింది. కంపెనీ తన మొత్తం సిరీస్ పాపులర్ ఐఫోన్‌ల ధరపై 3 నుంచి 4 శాతం తగ్గింపును ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై కస్టమ్స్ డ్యూటీని 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గించిన తర్వాత యాపిల్ ఈ నిర్ణయం తీసుకుంది.
యాపిల్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఐ ఫోన్ Pro, Pro Max వంటి ఖరీదైన ఫోన్ల ధరలు కూడా 5100 నుంచి 6000 రూపాయల వరకు తగ్గాయి. ఇది కాకుండా, మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్ 13, 14, 15 ధరలు తగ్గాయి. దీంతో పాటు ఐఫోన్ ఎస్ఈ ధర కూడా రూ.2300 తగ్గింది. ఆపిల్ తన ప్రో మోడల్స్ ధరలను తొలిసారిగా తగ్గించింది. బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ఇచ్చిన ఉపశమన ప్రయోజనాలను ఆపిల్ వెంటనే తన వినియోగదారులకు అందించింది.

ఇప్పటి వరకు కొత్త మోడల్ లాంచ్‌తో పాత ప్రో మోడల్‌లను నిలిపివేసింది. స్టాక్‌ను క్లియర్ చేయడానికి కొంతమంది డీలర్లు మాత్రమే ఈ మోడళ్లపై డిస్కౌంట్లు ఇచ్చేవారు. కానీ, ఈసారి కంపెనీయే తమ రేట్లను తగ్గించింది. ప్రో మోడల్ MRP ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. ఐఫోన్ మోడల్‌ల ధరలు ఇలా ఉన్నాయి. ఐఫోన్ ఎస్ఈ రూ .47600, ఐఫోన్ 13 రూ. 59,600, ఐఫోన్ 14 రూ. 69,600, ఐఫోన్ 14 ప్లస్ రూ. 79,600, ఐఫోన్ 15 రూ. 79,600, ఐఫోన్ 15 ప్లస్, రూ. 89,600, ఐ ఫోన్ 15 ప్రొ రూ. 1,29,800, ఐఫోన్ 15 ప్రొ మ్యాక్స్ రూ. 1,54,000 గా ఉంది.
ఐ ఫోన్ తో పాటు మిగతా మొబైల్ ఫోన్ల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. త్వరలో మిగతా ఫోన్ కంపెనీలు కూడా ధరల తగ్గే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఫోన్లు కొనుగోలు చేయాలనుకునే వారు కొన్ని రోజులు ఆగితే ధరలు తగ్గే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications