iPhone News: కర్ణాటకలోని కోలార్ ప్రాంతంలో విస్ట్రాన్ ఐఫోన్ అసెంబ్లింగ్ ప్లాంట్ కలిగి ఉన్న సంగతి తెలిసిందే. ఆపిల్ నిబంధనల ప్రకారం ఉత్పత్తి ద్వారా లాభాలను ఆర్జించటం కష్టతరంగా మారింది. దీంతో ఇండియాలో ప్లాంట్ విక్రయించాలని కంపెనీ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
Wistron కేవలం ఐఫోన్ అసెంబ్లీ ప్రొవైడర్‌గా దీర్ఘకాలిక లాభదాయకత లేకపోవడాన్ని ఎదుర్కొంటోంది. దీంతో వచ్చే ఏడాదిలోగా మెజారిటీ పెట్టుబడిని ఉపసంహరించుకోవాలని విస్ట్రాన్ చూస్తోంది. ఈ క్రమంలో కంపెనీ ఇండియాలో తన కార్యకలాపాలను క్రమంగా తగ్గిస్తోంది. ఇప్పుడు కంపెనీ వియత్నాం, మెక్సికో వంటి దేశాల్లో ఉన్న ప్రధాన ఐటీ వ్యాపారంపై దృష్టి పెట్టాలని విస్ట్రాన్ నిర్ణయించింది.

ప్రస్తుతం ఐఫోన్ అసెంబ్లింగ్ వ్యాపారంలో ఫాక్స్‌కాన్, పెగాట్రాన్ సింహ భాగాన్ని కలిగి ఉన్నాయి. ఇవి ఆపిల్ సంస్థకు అతిపెద్ద సరఫరాదారులుగా ఉన్నాయి. ఇవి ఇన్వెంటరీని సైతం భారీ స్థాయిలో నిర్వహిస్తూ ఉంటాయి. వీటితో పోల్చితే విస్ట్రాన్ పరిమాణం చాలా చిన్నగా ఉన్నందున అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని తెలుస్తోంది. కంపెనీ 2017లో ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టింది.
బెంగళూరు సమీపంలోని కోలార్ ప్రాంతంలో విస్ట్రాన్ ప్లాంట్ కలిగి ఉంది. ఇది తన ఉద్యోగులను నిలుపుకోవటానికి చాలా కష్టపడింది. 2020 డిసెంబర్- 2021 జనవరిలో అల్లర్లు భారీ స్థాయిలో జరిగాయి. చైనాతో పోల్చినప్పుడు భారతీయ ఉద్యోగుల మనస్తత్వం భిన్నంగా ఉండటం, పని సంస్కృతిలో తేడాలు కంపెనీకి అనేక సవాళ్లను తెచ్చాయి. పునర్నిర్మాణంలో భాగంగా Wistron తన iPhone అసెంబ్లీ సౌకర్యాన్ని టాటా గ్రూప్‌కు విక్రయిస్తోంది. నివేదికల ప్రకారం టాటా గ్రూప్ దేశంలో రాబోయే iPhone 15 మోడల్ అసెంబుల్ చేయడానికి ట్రయల్స్ నిర్వహిస్తోంది.


Click it and Unblock the Notifications