iPhone News: ఇండియాలో నిలిచిన ఆపిల్ ఫోన్ల తయారీ.. ఫాక్స్‌కాన్ సంచలన నిర్ణయం..
Foxconn News: దేశంలో ప్రఖ్యాత ఐఫోన్లను తయారు చేయారవుతున్న సంగతి తెలిసిందే. చైనా నుంచి వ్యూహాత్మకంగా ఆపిల్ తన తయారీని భారత్ కు మార్చిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు అది నిలిచిపోయింది.
వివరాల్లోకి వెళితే తైవాన్ టెక్ కంపెనీ ఆపిల్ ఐఫోన్లను మన దేశంలో తయారు చేస్తోంది. అయితే తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉత్పత్తిని కంపెనీ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నిన్న ప్రకటించింది. అయితే పరిస్థితులు ఇంకా కొలిక్కి రాకపోవటంతో నేడు సైతం కంపెనీ మెుదటి షిప్ట్ తయారీని రద్దు చేసినట్లు వెల్లడైంది. అయితే ఇవి త్వరలోనే తిరిగి మెుదలవుతాయని తెలుస్తోంది.

తమిళనాడు వ్యాప్తంగా మిచౌంగ్ తుపాను వల్ల కురిసిన కుండపోత వర్షాలతో చెన్నైలోని ఫాక్స్‌కాన్ ప్లాంట్ వరదల్లో చిక్కుకుంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో నీళ్లు మోకాళ్ల లోతుకు చేరుకోవటం రవాణాను అసాధ్యంగా మార్చేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఫాక్స్‌కాన్, పెగాట్రాన్ చెన్నై సమీపంలోని తమ ఫ్యాక్టరీలలో ఐఫోన్ ఉత్పత్తిని తాజాగా నిలిపివేసాయి. తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగా కీలకమైన రవాణా కేంద్రమైన చెన్నై విమానాశ్రయం రోజంతా కార్యకలాపాలు నిలిపివేయడంతో పరిస్థితి మరింత దిగజారిందని తెలుస్తోంది.
చైనా నుంచి ఐఫోన్ తయారీనీ మార్చాలనే క్రమంలో ఆపిల్ తన ఉత్పత్తిని 2020లో ఇండియాకు షిఫ్ట్ చేసింది. ఇప్పుడు భారతదేశం ఐఫోన్ ఉత్పత్తిలో సుమారు 7 శాతం వాటాను కలిగి ఉంది. అయితే 2025 నాటికి కంపెనీ తన భారత ఉత్పత్తిని 25 శాతానికి పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ లక్ష్యాన్ని అందుకునే దిశగా తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది.


Click it and Unblock the Notifications