Apple: ఇండియాలో క్రెడిట్ కార్డ్ లాంచ్ చేస్తున్న ఐఫోన్ మేకర్ ఆపిల్.. ప్రయోజనాలివే..
Credit Card: ఆపిల్ తన ఆదాయాలను పెంచుకునే ప్రయాణంలో భాగంగా అతిపెద్ద మార్కెట్ అయిన భారత్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో లోకల్ తయారీ, సొంత స్టోర్ల ఏర్పాటు చేసిన కంపెనీ మరో అడుగు ముందుకేస్తోంది.
అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం ఐఫోన్ మేకర్ ఆపిల్ ఇండియాలో తన ప్రత్యేక ఆపిల్ క్రెడిట్ కార్డులను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. తన కార్డును తీసుకొచ్చేందుకు HDFC బ్యాంక్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఏప్రిల్ నెలలో సీఈవో టిమ్ కుక్ తన భారత పర్యటనలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీఈవో, ఎండీ శశిధర్ జగదీషన్‌తో సమావేశమయ్యారని తెలుస్తోంది.

అయితే ఆపిల్ తన క్రెడిట్ కార్డును అమెరికా బయటి దేశాల్లో ప్రారంభించటం ఇదే తొలిసారి కావటం విశేషం. సాధారణంగా బ్యాంకులు మాత్రమే భారతదేశంలో క్రెడిట్ కార్డులను ప్రారంభించగలవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆపిల్ ను కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌ల కోసం సాధారణ విధానాన్ని అనుసరించాల్సిందిగా సూచించినట్లు సమాచారం. ఇదే క్రమంలో కంపెనీ తన ఆపిల్ పే సేవలను ఇండియాలో ప్రారంభించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI)తో కూడా చర్చలు జరుపుతోంది.
ఇప్పటికే భారత డిజిటల్ చెల్లింపుల రెవల్యూషన్లో అమెరికాకు చెందిన గూగుల్, అమెజాన్ పోటీ పడుతుండగా ఆపిల్ కూడా అదేదారిలో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే చర్చలు యూపీఐ గురించా లేక రూపే ఆధారిత క్రెడిట్ కార్డు గురించా అనేదానిపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. భారత మార్కెట్టుపై ఫోకస్ పెట్టిన కంపెనీ ఇప్పటికే తన ఐఫోన్ ఉత్పత్తిని ఇక్కడికి షిఫ్ట్ చేయగా.. రానున్న 3-4 ఏళ్లలో మెుత్తం మొబైల్ ఫోన్ ఉత్పత్తిలో దాదాపు 25% మనదేశం నుంచి చేపట్టే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications