Apple iPhone: అమెరికాకు చెందిన ఐఫోన్ తయారీ సంస్థ ఆపిల్ తన ఉత్పత్తి కేంద్రాలను ఇండియాలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వం షరతుల మేరకు నేరుగా స్టోర్లను ప్రారంభించి వ్యాపారం చేసేందుకు కొంత తయారీని కర్ణాటకకు షిఫ్ట్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే కంపెనీ మే నెలలో కీలకమైన మైలురాయిని అధిగమించింది. ఇండియాలో తయారు చేయబడిన ఐఫోన్ల ఎగుమతి రికార్డు స్థాయిలో రూ.10,000 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడైంది. దీంతో దేశం నుంచి మెుత్తం స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు రూ.12,000 కోట్లకు చేరుకున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ మే నెలల్లో మెుత్తం స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు రూ.20,000 కోట్ల మార్కును అధిగమించాయి. గత ఏడాది ఇదే కాలంలో ఎగుమతులు కేవలం రూ.9,066 కోట్లుగా నమోదయ్యాయి.

ఇండియాలో తన కార్యకలాపాలను ప్రారంభించి విజయవంతంగా, లాభదాయకంగా ముందుకు సాగుతున్న ఆపిల్ బాటలోనే టెస్లాతో పాటు ఇతర అమెరికా కంపెనీలను తమ ఉత్పత్తిని ఇండియాకు తరలించడానికి ఒప్పించేందుకు దోహదపడుతుందని భారతీయ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశం నుంచి స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో అత్యధిక వాటా 80 శాతం ఐఫోన్‌లదే.

జూన్ 21-24 మధ్య ప్రధాని మోదీ యూఎస్ పర్యటన ఇతర యూఎస్ బ్రాండ్‌లతో భాగస్వామ్యాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. అలాగే సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఇతర విభాగాలపై దృష్టి సారించి తమ సరఫరా గొలుసులను భారతదేశానికి మార్చడానికి కంపెనీలను ఒప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.


Click it and Unblock the Notifications