ఐఫోన్ అంటే ఒక బ్రాండ్. దాని కొత్త మోడల్ వస్తుందంటే అంతే ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి ఇంకా దాని మీదనే ఉంటుంది. ఇప్పుడు apple ఐఫోన్ గురించి ఆసక్తికర సమాచారం ఒకటి వెలుగులోకి వచ్చింది.

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు కింద పనిచేసే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(CERT-IN) తాజా హెచ్చరికలో, ఆపిల్ పరికరాల్లో కొన్ని తీవ్రమైన భద్రతా లోపాలు గుర్తించాలని ప్రకటించింది. ఈ లోపాలు ఐఫోన్, ఐప్యాడ్, మాక్, ఆపిల్ వాచ్, ఆపిల్ టీవీ మరియు visionOS వంటి పలు ఆపిల్ డివైస్ల వివిధ సాప్ట్ వేర్ వెర్షన్లలో ఉండటం గమనార్హం.
ఆపిల్ విడుదల చేసిన తాజా హెచ్చరిక ప్రకారం, పాత వర్షన్లు వాడుతున్న ఐఫోన్, ఐప్యాడ్, మాక్, ఆపిల్ వాచ్, ఆపిల్ టీవీ వంటి పరికరాలు సైబర్ ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని తేలింది. ముఖ్యంగా, iOS 18.6 కంటే పాత వర్షన్లు, ఐప్యాడ్OS 17.9.9 లేదా అంతకంటే తక్కువ, macOS Sequoia 15.6 కి ముందు, macOS Sonoma 14.7.7 కంటే తక్కువ, macOS Ventura 13.7.7 కి ముందు, watchOS 11.6 కంటే తక్కువ, tvOS 18.6 కంటే తక్కువ, visionOS 2.6 కంటే తక్కువ వర్షన్లు వాడుతున్న వినియోగదారులు అత్యధిక ప్రమాదంలో ఉన్నారని హెచ్చరించింది. వీరందరూ వెంటనే తాజా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ను ఇన్‌స్టాల్ చేయాలని చెప్పింది.
CERT-IN చెప్పిన ప్రకారం, యాపిల్ పరికరాల్లో వచ్చిన భద్రతా లోపాలు కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఏర్పడ్డాయని వెల్లడించారు. ఇందులో ముఖ్యంగా కొన్ని రకాల లోపాలు ఉన్నాయి. ఉదాహరణకు, టైప్ కన్ఫ్యూజన్ అనే లోపం వల్ల సిస్టమ్ అర్థం చేసుకోవలసిన డేటాను తప్పుగా అర్థం చేసే ప్రమాదం ఉంటుంది. అలాగే, యూజ్-ఆఫ్టర్-ఫ్రీ అనే లోపం వల్ల, ఒకసారి పోయిన మెమరీని మళ్లీ ఉపయోగించేందుకు ప్రయత్నించటం జరుగుతుంది. దీని వల్ల అనుకోకుండా యాప్ క్రాష్ అవ్వడం లేదా హ్యాకర్లు ఆ మెమరీని దుర్వినియోగం చేయడం వంటి ప్రమాదాలు తలెత్తవచ్చు. కొన్నిసార్లు అవుట్-ఆఫ్-బౌండ్స్ మెమరీ యాక్సెస్ జరుగుతూ, అనధికారిక డేటాను యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది.
అంతేకాదు, ఇన్టిజర్ ఓవర్ఫ్లోలు, బఫర్ ఓవర్ఫ్లోలు కూడా ప్రాసెసింగ్‌లో ఎర్రర్లు కలిగించి సెక్యూరిటీకి ముప్పుగా మారుతాయి. ఇక, రేస్ కండిషన్స్ అనే లోపం వల్ల ఒకే సమయంలో ఎన్నో ప్రాసెసులు జరిగినప్పుడు అవి సరిగా కంట్రోల్ చేయలేకపోవడం కూడా ప్రమాదంగా మారుతుంది. చివరగా, కొన్ని పరికరాలు ఫైల్ పార్సింగ్ సమయంలో నిబంధనలు పాటించకపోవడం వల్ల హ్యాకింగ్‌కు అవకాశం ఏర్పడుతుంది.
ఆపిల్ కొత్తగా ఇచ్చిన అప్డేట్లు (iOS 18.6, iPadOS 18.6, macOS 15.6, watchOS 11.6, tvOS 18.6, visionOS 2.6) వెంటనే ఇన్స్టాల్ చేయండి. ఇవి మీ పరికరాలను సురక్షితంగా ఉంచేందుకు చాలా అవసరం. అనుమానాస్పద లింకులు లేదా ఫైళ్లను క్లిక్ చేయవద్దు. అపరిచిత వ్యక్తుల మెసేజ్‌లు, ఇమెయిళ్లు వచ్చినప్పుడు ఇంకా జాగ్రత్త వహించాలి.
మొబైల్ లేదా లాప్‌టాప్ అకస్మాత్తుగా ఆఫ్ కావడం, వేడి ఎక్కువగా రావడం, బ్యాటరీ త్వరగా తగ్గిపోవడం వంటి సమస్యలు ఉంటే నిర్లక్ష్యం చేయవద్దు. ఇది ప్రమాద సూచన కావచ్చు. ఆపిల్, భద్రతలో లోపాలు ఉన్నప్పుడు వాటిని మౌనంగా పరిష్కరించి తరువాతే వివరాలు బయటపెడుతుంది. అందుకే ఎప్పటికప్పుడు అప్డేట్‌లు చెయ్యడం మీ భద్రతకు చాలా ముఖ్యమైనది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications