ప్రతి ఏడాది సెప్టెంబర్‌లో యాపిల్ నుంచి కొత్త ఐఫోన్ వస్తాయన్నది మామూలే. కానీ ఈ సారి "ఐఫోన్ 17 సిరీస్"లో కొంచెం స్పెషల్ ఉంది. యాపిల్ మొదటిసారి "ప్లస్" మోడల్‌ని తీసేసి, దాని బదులు "ఐఫోన్ ఎయిర్" అనే కొత్త మోడల్‌ని తీసుకొచ్చింది. పేరు విన్న వెంటనే లైట్, సన్నగా, స్టైలిష్ అని అనిపిస్తుందిగా? నిజంగానే అది సన్నగా డిజైన్ చేసారు.
ఈ సిరీస్‌లో మొత్తం నాలుగు మోడల్స్ ఉన్నాయి. ఐఫోన్ 17 (బేస్ వెర్షన్), ఐఫోన్ ఎయిర్ (అల్ట్రా-థిన్ కొత్త ఎంట్రీ), ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్. ఈ నాలుగు మోడల్స్‌లో ఎక్కడా "సేఫ్ ప్లే" అనిపించదు. యాపిల్ సరిగ్గా "గేమ్ చేంజర్" లా కొన్ని ఫీచర్స్ ఇచ్చింది.

iPhone 17 - బేస్ మోడల్: సాధారణంగా బేస్ మోడల్ అంటే "ఓకే లెవల్" అప్‌డేట్స్ మాత్రమే వస్తాయి. కానీ ఈ సారి ఆ ట్రెండ్‌ని బ్రేక్ చేసింది యాపిల్.
డిస్‌ప్లే: 6.3-అంగుళాల సూపర్ రెటీనా XDR డిస్‌ప్లేతో పాటు "120Hz ప్రో మోషన్" కూడా ఇచ్చింది. ఇప్పటివరకు ఇది కేవలం ప్రో మోడల్స్‌కే లభించే ఫీచర్. Always-On డిస్‌ప్లే కూడా ఉంది. బ్రైట్‌నెస్ 3000nits బయట ఎండలో కూడా స్క్రీన్ సూపర్ క్లియర్‌గా కనిపిస్తుంది.
పర్ఫార్మెన్స్: కొత్త "A19 చిప్" (3nm)తో వచ్చింది. AI పనుల్లో వేగం పెరిగింది, GPU 20% ఫాస్టర్. iOS 26తో వచ్చే "ఆపిల్ ఇంటెలిజెన్స్" ఫీచర్లు (లైవ్ ట్రాన్స్‌లేషన్, విజువల్ ఇంటెలిజెన్స్ వంటివి) కూడా ఈ ఫోన్‌లో పనిచేస్తాయి.
కెమెరా: పెద్ద అప్‌గ్రేడ్. 48MP మెయిన్, 48MP అల్ట్రా వైడ్ కెమెరాలు, 2x టెలిఫోటో సపోర్ట్. ముందు కెమెరా 18MP, AI ఆధారంగా ఫ్రేమింగ్ చేస్తుంది. ఇంకా ఒకేసారి ఫ్రంట్ + రేర్ కెమెరా రికార్డింగ్ చేసే డ్యూయల్ క్యాప్చర్ కూడా ఉంది.
బ్యాటరీ: గత మోడల్ కంటే 8 గంటలు ఎక్కువ. 40W అడాప్టర్‌తో 20 నిమిషాల్లో 50% చార్జ్.
స్టోరేజ్: ఇకపై 128GB ఆప్షన్ లేదు. 256GB నుంచే స్టార్ట్.
ధర: రూ. 82,900 నుంచి మొదలు.
ఐఫోన్ ఎయిర్: ఈ సారి మొత్తం హైప్ ఈ మోడల్‌దే. ఎందుకంటే ఇది అత్యంత సన్నని ఐఫోన్. కేవలం 5.6mm మందమే! ఐఫోన్ 6 కంటే కూడా సన్నగా.
డిజైన్: Grade-5 టైటానియం బాడీ, మిర్రర్ ఫినిష్, ముందు-వెనుక సిరామిక్ షీల్డ్. పక్కన పట్టుకున్నా "వావ్" అనిపించేంత లైట్ వెయిట్.
డిస్‌ప్లే: 6.5" సూపర్ రెటీనా XDR ప్రో మోషన్, 120Hz, 3000nits బ్రైట్‌నెస్.
ప్రాసెసర్: A19 Pro చిప్ - యాపిల్ ప్రకారం మ్యాక్‌బుక్ ప్రో స్థాయి GPU పనితీరు ఇస్తుంది. అలాగే కొత్త "N1 వైర్‌లెస్ చిప్" (Wi-Fi 7, Bluetooth 6) మరియు అప్‌డేటెడ్ "C1X మోడెమ్" ఉంది. మరో ప్రత్యేకత ఇది యాపిల్ నుంచి వచ్చిన "మొదటి eSIM-only iPhone".
కెమెరా: 48MP ఫ్యూజన్ కెమెరా (OIS, 2x టెలిఫోటో) + 18MP ముందు కెమెరా. డ్యూయల్ క్యాప్చర్ కూడా సపోర్ట్ చేస్తుంది.
బ్యాటరీ: 27 గంటల వీడియో ప్లేబ్యాక్. కానీ స్లిమ్ మాగ్‌సేఫ్ బ్యాటరీ ప్యాక్ తీసుకుంటే దాన్ని 40 గంటల వరకు పొడిగించుకోవచ్చు.
ధర: రూ. 1,19,900 మొదలు.
ఐఫోన్ 17 ప్రో & ప్రో మాక్స్: ఈ రెండు మోడల్స్‌లో యాపిల్ తన అసలైన "ప్రో లెవల్" గేమ్ చూపించింది.
డిజైన్: ఫోర్గ్డ్ అల్యూమినియం యూనిబాడీ. వెనుక భాగంలో కొత్త Plateau కెమెరా లేఅవుట్. లోపల వేపర్ చాంబర్ కూలింగ్ పెట్టారు, దాంతో 40% ఎక్కువ నిరంతర పనితీరు వస్తుందని యాపిల్ చెబుతోంది.
డిస్‌ప్లే: సూపర్ రెటీనా XDR, ప్రో మోషన్, 3000nits బ్రైట్‌నెస్. సిరామిక్ షీల్డ్ 2తో అదనపు ప్రొటెక్షన్.
కెమెరా: ట్రిపుల్ 48MP Fusion సిస్టమ్. కొత్త టెలిఫోటో లెన్స్‌తో 4x (100mm), 8x (200mm) ఆప్టికల్ జూమ్. ఇంకా 40x వరకు డిజిటల్ జూమ్. వీడియోలో ప్రోరెస్ రా, ఆపిల్ లాగ్ 2, జెన్లాక్ వంటివి ప్రొఫెషనల్ లెవల్ లో లభిస్తుంది.
బ్యాటరీ: ప్రో మాక్స్ - 37 గంటల వీడియో ప్లేబ్యాక్, ప్రో - 31 గంటల వరకు. ఇప్పటివరకు వచ్చిన ఐఫోన్ల్లో ఎక్కువ బ్యాటరీ ఉన్నది ప్రో మాక్స్ కే.
స్టోరేజ్: Pro - 256GB నుంచి, ప్రో మాక్స్ - గరిష్టంగా 2TB వరకు.
ధరలు: Pro - రూ. 1,34,900 నుంచి, Pro Max - రూ. 1,49,900 నుంచి
ఈ సారి ఐఫోన్ 17 సిరీస్‌లో "ఎయిర్" ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాని సన్నదనం, eSIM-only ఫీచర్, ప్రీమియం డిజైన్ చూసి "ఇదే కావాలి" అనిపించొచ్చు. మరోవైపు, బేస్ మోడల్‌కే ProMotion డిస్‌ప్లే రావడం కూడా బిగ్ సర్ప్రైజ్. ప్రో మోడల్స్‌కి మాత్రం కెమెరా, బ్యాటరీ, పనితీరు అన్నీ మాక్స్ అవుట్ అయి ప్రొఫెషనల్స్‌కి అనుకూలంగా మారాయి.
అందుకే మీరు స్లిమ్ & స్టైలిష్ ఫోన్ కావాలనుకుంటే "ఐఫోన్ ఎయిర్", ప్రాక్టికల్ అప్‌గ్రేడ్ కోసం ఐఫోన్ 17, మరి కెమెరా/పెర్ఫార్మెన్స్ ఆల్-రౌండర్ కావాలంటే ప్రో లేదా ప్రో మాక్స్ పర్ఫెక్ట్ ఆప్షన్స్.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications