ఆపిల్ ఐఫోన్ 12 ఆలస్యంగా మార్కెట్లోకి వచ్చినప్పటికీ అక్టోబర్‌లో ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన 5 జి స్మార్ట్‌ఫోన్ మోడల్‌గా అవతరించింది. ఫలితంగా అక్టోబర్ నెలలో మొదటి రెండు వారాల్లో విపరీతమైన అమ్మకాలు జరిగాయని పేర్కొంది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ యొక్క నెలవారీ మార్కెట్ పల్స్ సర్వీస్ ప్రకారం, ఐఫోన్ 12 ప్రో ఈ నెలలో అత్యధికంగా అమ్ముడైన 5 జి మోడల్ గా పేర్కొనబడింది.

స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో నాలుగో వంతుకు ఐఫోన్ 12 మరియు 12 ప్రో అమ్మకాలు
ఐఫోన్ 12 మరియు 12 ప్రో కలిసి అక్టోబర్‌లో జరిగిన 5 జి స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో నాలుగో వంతుకు దగ్గరగా ఉన్నాయి. ఐఫోన్ 12 సిరీస్ కోసం డిమాండ్ 2020 చివరి త్రైమాసికంలో కూడా బలంగా ఉందని తెలుస్తోంది, ముఖ్యంగా డిసెంబర్లో పండుగ సీజన్లో ఆపిల్ ఐఫోన్ 12 ప్రో కు డిమాండ్ బాగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఐఫోన్ 12 జనవరి-అక్టోబర్ 2020 కొరకు 5 జి మొబైల్ టాప్ 10 బెస్ట్ సెల్లర్ జాబితాలో ప్రవేశించి ఏడవ స్థానాన్ని సాధించింది.

ఐఫోన్ 12 సీరీస్ కోసం విపరీతమైన డిమాండ్
ఆ తర్వాతసెప్టెంబరులో అత్యధికంగా అమ్ముడైన 5 జి మొబైల్ అయిన శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రా 5 జి మూడవ స్థానానికి పడిపోయింది. 5జీ అప్‌గ్రేడ్ కోసం ఇప్పుడు పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది, ముఖ్యంగా ios బేస్ లోపల, ఇది ఇప్పుడు బాగా డిమాండ్ గా ఉంది . ముఖ్యంగా యుఎస్ లో, ఈ నెలలో ఐఫోన్ 12 మరియు 12 ప్రో అమ్మకాల్లో మూడింట ఒక వంతు వాటా ఉందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అనలిస్ట్ మిశ్రా వివరించారు .చైనా మరియు జపాన్ లలో కూడా ఐఫోన్ 12 సిరీస్ కోసం బలమైన ప్రారంభ డిమాండ్ ఉందని ఆయన పేర్కొన్నారు .

ఐఫోన్ 12 సిరీస్ ద్వారా, ఆపిల్ 5 జి స్మార్ట్ ఫోన్ మార్కెట్ కు అవసరమైన ఊతం
నివేదిక ప్రకారం, ఐ ఫోన్ 12 ప్రో ఆలస్యంగా ప్రారంభించిన కారణంగా, అమ్మకాలు ఆలస్యంగా సాగుతున్నాయి . కొన్ని నెలల వెనకకు అమ్మకాలు నెట్టబడ్డ కారణంగా 2021 ప్రారంభంలో ఐఫోన్ 12 సిరీస్ యొక్క తన అమ్మకాల వేగాన్ని కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు . ఐఫోన్ 12 సిరీస్ ద్వారా, ఆపిల్ 5 జి స్మార్ట్ ఫోన్ మార్కెట్ కు చాలా అవసరమైన ఊతం అందించిందని , ఇది అక్టోబర్లో ప్రపంచ స్మార్ట్ ఫోన్ అమ్మకాలలో అత్యధికంగా 24 శాతం వాటాను పొందింది అని రిసెర్చ్ అనలిస్ట్ మిశ్రా పేర్కొన్నారు .


Click it and Unblock the Notifications