Multibagger Stock: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలంటే చాలా ఓపికతో పాటు ఫండ్స్ కూడా అవసరం. మార్కెట్లో అనేక కంపెనీల షేర్లు స్వల్పకాలంలో వేగంగా వృద్ధి చెందడం లేదని వాటి ట్రెండ్‌లో కనిపిస్తోంది. అయితే.. దీర్ఘకాలం పాటు కొనసాగించిన ఇన్వెస్టర్లను మాత్రం ధనవంతులను చేశాయి. అలా మల్టీబ్యాగర్ రాబడులను అందించిన ప్రభుత్వ చమురు కంపెనీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కంపెనీ వివరాలు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ప్రభుత్వరంగ చమురు కంపెనీ అయిన IOCL గురించే. ఇండియన్ ఆయిర్ కార్పొరేషన్ కంపెనీ వృద్ధితో పాటు తన ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను సైతం అందించింది. వారిని ఏకంగా మిలియనీర్లుగా మార్చేసింది. ఈ క్రమంలో గత 20 ఏళ్ల కాలంలో 4 సార్లు బోనస్ షేర్లను అందించింది. షేర్ ఇన్వెస్టర్లకు పెట్టుబడిపై 100 రెట్లు రాబడిని అందించింది.

బోనస్ షేర్ల వివరాలు ఇలా..
గడిచిన 21 ఏళ్లను గమనిస్తే.. కంపెనీ 2009, 2016, 2018, 2022లో తన ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను ఇచ్చింది. అక్టోబర్ 2009లో మొదటిసారిగా కంపెనీ 1 షేరుకు ఒక షేరు బోనస్ షేరును అందించింది. సుమారు 7 ఏళ్ల తర్వాత 2016లో ఇదే తరహాలో షేరుకు షేరు బోనస్ ప్రకటించింది. ఆ తర్వాత 2018లో కంపెనీ మళ్లీ 1:1 నిష్పత్తిలో బోనస్‌ని అందించింది. ఈ ఏడాది జూన్‌లో కంపెనీ 1:2 నిష్పత్తిలో (రెండు షేర్లకు ఒక షేరు) ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను ఇచ్చింది.

బోనస్ మ్యాజిక్ సూపర్..
ఎవరైనా ఇన్వెస్టర్ 21 ఏళ్ల క్రితం రూ.7 చొప్పున లక్ష విలువైన షేర్లను కొనుగోలు చేస్తే వారికి 14,285 షేర్లు వచ్చేవి. అవి నాలుగు సార్లు బోనస్ తర్వాత 14,285 షేర్ల సంఖ్య 1,71,420కి పెరుగుతుంది. ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం ఈ షేర్ల విలువ దాదాపు రూ.1.12 కోట్లుగా ఉంది. అంటే దీర్ఘకాలం పెట్టుబడులను కొనసాగించిన ఇన్వెస్టర్లకు లక్ష రూపాయలపై 100 రెట్లు రాబడి లభించింది. లక్ష పెట్టుబడిగా పెట్టిన వారికి కోటి రూపాయలకు పైగా ఆదాయం లభిస్తోంది.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Stock market: ఇన్వెస్టర్ల కొంప ముంచిన మార్కెట్! ఒక్కరోజే రూ. 8 లక్షల కోట్లు ఆవిరి.. కారణాలివే!

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications