వారి సంపద భారీగా జంప్, 3 రోజుల్లో రూ.6.39 లక్షల కోట్ల సంపద పెరిగింది
మార్కెట్లు గతమూడు రోజులుగా భారీ లాభాల్లో ముగిశాయి. ఈ కాలంలో లేదా ఈ వారం ఇప్పటి వరకు సెన్సెక్స్ ఏకంగా 1800 పాయింట్లకు పైగా ఎగిసింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద భారీగా పెరిగింది. సెన్సెక్స్ చాన్నాళ్లకు 50,000 పాయింట్ల సమీపానికి చేరుకుంది. నిన్న 789.70(1.61%) పాయింట్లు ఎగిసి 49,733.84 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిన్న ఓ సమయంలో 860 పాయింట్ల వరకు లాభపడింది. అంతకుముందు రెండు సెషన్లలో 500 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ 211.50 (1.44%) పాయింట్లు ఎగిసి 14,864.55 పాయింట్ల వద్ద ముగిసింది.

రూ.6 లక్షల కోట్లు జంప్
స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో కదలాడుతుండటంతో ఇన్వెస్టర్ల సంపద భారీగా పెరిగింది. గత మూడు రోజుల్లో బీఎస్‌ఈలోని సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 6,39,437.31 కోట్లు ఎగిసింది. గత మూడు రోజుల్లో 1,855 పాయింట్లు ఎగిసింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ వ్యాల్యూ మొత్తంగా రూ.2,08,76,479.11 కోట్లకు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపద ఈ మూడు రోజుల్లో రూ.6.39 లక్షల కోట్లు పెరిగింది.

ఒక్కరోజులో...
ఇన్వెస్టర్ల సంపద నిన్న ఒక్కరోజు రూ.2.1 లక్షల కోట్లు పెరిగింది. బజాజ్ ఫైనాన్స్ నాలుగో త్రైమాసికం ఫలితాల నేపథ్యంలో ఈ స్టాక్స్ ఏకంగా 8 శాతం పెరిగాయి. యాక్సిస్ బ్యాంకు స్టాక్స్ నాలుగో త్రైమాసిక ఫలితాలు కూడా ఆశాజనకంగా ఉండటంతో లాభపడ్డాయి. బ్రిటానియా ప్రాఫిట్ రెండు శాతం నష్టపోవడంతో ఈ స్టాక్స్ తగ్గాయి.

టాప్ గెయినర్స్.. లూజర్స్
నిన్నటి టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్ 8.55 శాతం, ఐచర్ మోటార్స్ 5.05 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 5.04 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 3.94 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 3.77 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో బ్రిటానియా 1.76 శాతం, హిండాల్కో 1.00 శాతం, HDFC లైఫ్ 0.91 శాతం, నెస్ట్లే 0.87 శాతం, బీపీసీఎల్ 0.68 శాతం నష్టపోయాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో బజాజ్ ఫిన్ సర్వ్, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, టాటా స్టీల్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications