Stock Market: జాగ్రత్తగా అడుగేస్తున్న ఇన్వెస్టర్లు.. నెగటివ్ లో కీలక సూచీలు.. అందరి వెయిటింగ్ అందుకే..
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నాయి. ప్రధాన సూచీలు స్వల్ప నష్టాల్లో ఉండగా.. బ్యాంకింగ్ సూచీ మాత్రం లాభంలో ఉంది. ప్రధానంగా ఈ రోజు రాత్రికి అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వడ్డీ రేట్లపై ఎలా స్పందిస్తుందనే ఆందోళనలో ఇన్వెస్టర్లు ఉన్నారు. అందుకే అంతర్జాతీయ మార్కెట్లు సైతం మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి.

రిజర్వు బ్యాంక్..
ఈ రోజు రాత్రికి ఫెడ్ తీసుకునే నిర్ణయాల ఆధారంగా భారత సెంట్రల్ బ్యాంక్ రేపు నిర్విహిస్తున్న అత్యవసర సమావేశంలో వడ్డీ రేట్లపై కీలక ప్రకటన చేయనుందని నిపుణులు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణాన్ని ధీటుగా ఎదుర్కోవటానికి సాహసోపేత నిర్ణయాలు ఉంటాయని RBI గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పింది ఇప్పుడు చేతల్లో కనిపిస్తోంది.

మార్కెట్ సూచీలు..
ఉదయం ప్రారంభంలోనే రెండు బెంచ్ మార్క్ సూచీలు స్వల్ప నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. 11.37 గంటల సమయంలో సెన్సెక్స్ సూచీ 145 పాయింట్ల నష్టపోగా, నిఫ్టీ 38 పాయింట్ల నష్టంలో ట్రేడ్ అవుతోంది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 32 పాయింట్ల లాభంలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 46 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి. దేశీయ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడానికి ముందు సెంట్రల్ బ్యాంకులు ప్రకటించే నిర్ణయాల కోసం ఎదురుచూస్తున్నట్లు కనిపిస్తోంది.

టాప్ గెయినర్స్..
ఈ క్రమంలో హిందాల్కొ, సన్ ఫార్మా, ఓఎన్జీసీ, ఐటీసీ, కోల్ ఇండియా, దివీస్ ల్యాబ్, డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్, విప్రో, హెచ్డీఎఫ్సీ, హెట్ మహీంద్రా, బీపీసీఎల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎస్బీఐ, రిలయన్స్ తో పాటు మరిన్ని కంపెనీల షేర్లు లాభాల్లో టాప్ గెయినర్స్ గా కొనసాగుతున్నాయి.

టాప్ లూజర్స్..
ఇదే సమయంలో భారతీ ఎయిర్ టెల్, అపోలో హాస్పిటల్స్, ఐషర్ మోటార్స్, మారుతీ, హిందుస్థాన్ యూనీలివర్, ఇన్ఫోసిస్, నెస్లే ఇండియా, బ్రిటానియా, టైటాన్, హీరో మోటొకార్ప్, ఎన్టీపీసీ, బజాజ్ ఆటో, ఎల్ అండ్ టీ, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, టాటా కన్జూమర్, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీల షేర్లు టాప్ లూజర్స్ గా కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications