Zerodha News: స్టాక్ మార్కెట్లో సాంప్రదాయ బ్రోకరేజ్ సంస్థలకు భిన్నంగా పలు డిస్కౌంట్ బ్రోకర్లు పుట్టుకొచ్చాయి. వాటిలో జెరోధా పెట్టుబడిదారుల అభిమానం చూరగొంది. దాని ఇంటర్‌ఫేస్ సహా పలు ఫీచర్స్ సంస్థను అగ్రగామిగా నిలిపాయి. అయితే ఇటీవల జెరోధాపై వ్యతిరేకత పెరుగుతూ వస్తోంది.
జెరోధా ట్రేడింగ్ యాప్ కైట్ గత కొన్ని నెలల నుంచి వరుసగా టెక్నికల్ గ్లిచ్‌లను ఎదుర్కొంటోంది. శుక్రవారం ట్రేడింగ్ చేస్తున్న సమయంలో తలెత్తిన సాంకేతిక ఇబ్బందుల వల్ల క్లయింట్‌లకు నష్టం వాటిల్లింది. ఇదే గతంలోనూ పలుమార్లు పునరావృతం కావడంతో చాలా మంది వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా తిట్టిపోశారు. ఇందులో భాగంగా "బాయ్ కాట్ జెరోధా" హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు.

'జెరోధాలో టెక్నికల్ లోపం కారణంగా జూలై 2023లో 33వేలు నష్టపోయాను. మధ్యాహ్నం 3 గంటల సమయంలో పెట్టిన బై ఆర్డర్ 3.31కి ఎగ్జిక్యూట్ అయింది. ఫిర్యాదు చేసిన అనంతరం నాకు 50 శాతం తిరిగి ఇస్తానని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. కానీ ఇప్పటి వరకు వారి నుంచి ఎటువంటి స్పందన లేదు' అంటూ ఓ వినియోగదారుడు తన అనుభవాన్ని Xలో పోస్ట్ చేశారు.
గత నాలుగు నెలల్లో వరుసగా నాలుగు సార్లు జెరోధాలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. అక్టోబర్ 31, నవంబర్ 6, డిసెంబరు 4 మరియు జనవరి 29 తేదీల్లో పలువురు యూజర్లు సమస్యను ఎదుర్కొన్నారు. నియంత్రణ సంస్థలు ఇప్పటికైనా ఈ విషయాన్ని పరిశీలించాలని వినియోగదారులు కోరుతున్నారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications