IPL News: మనకు తెలియకుండానే మనచుట్టూ ఉండే, జరిగే అనేక రోజువారీ అంశాల్లో ఆర్థిక సూత్రాలు నిగూఢంగా ఇమిడి ఉంటాయి. అది ఆట అయినా లేక పాట అయినా. అయితే వాటిని సరిగా అర్థం చేసుకోవటంలోనే ఉంటుంది అసలు విజయం. అవును తాజాగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) సైతం మనకు కొన్ని కీలక ఆర్థిక సూత్రాలను నేర్పిస్తోంది.
క్రికెట్ లో ఒక ప్రసిద్ధి చెందిన సామెత ఉంటుంది అదేంటంటే ఆఖరి బంతి వేసే వరకు ఆట ముగియదు అని. అలాగే ప్రతి వ్యక్తి తాను ఎక్కువ సంపాదిస్తున్నాడా లేక తక్కువ సంపాదిస్తున్నాడా అనే విషయాన్ని పక్కనబెడితే దానిని ఎంత బాగా నిర్వహిస్తున్నాడు.. ఏ సమయంలో దానిని ప్రారంభించాడు అనే విషయాలు చాలా కీలకంగా మారతాయి.
డబ్బు విషయంలో ముందుగా నేర్చుకోవాల్సిన విషయం గత విజయాలు గతకాలానికే పరిమితం. పర్సనల్ ఫైనాన్స్ విషయంలో ఇంతకు ముందు మంచి ఆదాయాన్ని అందించిన పెట్టుబడి ఎంపిక ఇప్పుడు అలాగే రాబడిని ఇవ్వాలని లేదు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మార్చుకుని మంచి రిటర్న్స్ అనే విజయాన్ని పొందాలి.

తెలివైన ఇన్వెస్టర్లు డబ్బు పెట్టుబడుల విషయంలో ప్రస్తుత కాలంలో తమ అవసరాలకు సరిపోయే సరైన పెట్టుబడి ఎంపికలను ఎంచుకుని సైలెంట్ గా ముందుకు సాగుతుంటారు. ఇందుకోసం పెట్టుబడులపై చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, పేరెంట్స్, మీడియా, సహోద్యోగులు ఇలా చాలా మంది ఇచ్చే సలహాలు మీ అవసరాలకు సూట్ కాకపోవచ్చు.
అలాగే సోషల్ మీడియా ఇన్ ఫ్లుయన్సర్లు ఇచ్చే స్టాక్ అడ్వైజులను పట్టించుకోకపోవటం మంచిది. అలాగే పెట్టుబడుల విషయంలో ఎంత ముందుగా ప్రయాణాన్ని ప్రారంభిస్తే అంత మంచి రాబడులను పొందే అవకాశాలు ఉంటాయి. చివరి బంతి వరకు వేచి చూడాల్సిందే అన్నట్లు మీ లక్ష్యాలను చేరుకునేంత వరకు పెట్టుబడుల విషయంలో క్రమశిక్షణ చాలా ముఖ్యం.
రెండేళ్ల కిందట రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, రాహుల్ త్రిపాఠి వంటి ఆటగాళ్లు చాలా తక్కువ మందికి తెలుసు. కానీ ఇప్పుడు వారిలో ఇద్దరు జాతీయ జట్టులోకి వచ్చారు. అలాగే జీతం తక్కువగా ఉన్నప్పుడు తక్కువ మెుత్తంతో పొదుపు చేయటం ప్రారంభించాలి. క్రమబద్ధంగా చేసే పెట్టుబడులు మంచి కార్పస్ పోగుచేయటంతో సహాయపడతాయి.
కొన్ని సంవత్సరాల తర్వాత ఊహించని ఆశ్చర్యపరిచే రాబడిని అందిస్తాయి. అలాగే ఆటలో టాస్ గెలవటం నుంచి ఫీల్డింగ్ వరకు ఎలా అన్నింటిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటారో.. అలాగే పెట్టుబడుల పోర్ట్ ఫోలియోను క్రమం తప్పకుండా సమీక్షించాలి. రిస్క్, రిటర్న్, టాక్స్, టైమ్ వంటి అనేక అంశాలు ఇందులో ముడిపడి ఉంటాయి.
చివరిగా నేర్చుకోవాల్సిన సూత్రం ఏమిటంటే డబ్బును పొదుపుచేయాలని అనుకోవటాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చి ప్రారంభించటమే సగం విజయం అని చెప్పుకోవచ్చు. అందుకే మనపెద్ద వారు A good start is work half done అని అంటారు. కాబట్టి పర్సనల్ ఫైనాన్స్ విషయంలో మనం ముందుకు సాగటానికి మనమే మోటివేషన్ పొందాల్సి ఉంటుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications