Investment: బడ్జెట్ తర్వాత ఏ రంగాల్లో ఇన్వెస్ట్ చేయాలో చెప్పిన మోతీలాల్ ఓస్వాల్..!!

Budget Investment: బడ్జెట్ ప్రవేశపెట్టి దాదాపు రెండు రోజులు గడుస్తోంది. బడ్జెట్ తర్వాత నిన్న దేశీయ స్టాక్ మార్కెట్లు తెరచుకున్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు చైనా, కెనడా, మెక్సికోలపై వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించటంతో మార్కెట్లు కుప్పకూలిన సంగతి తెలిసిందే. అలాగే బడ్జెట్ 2025 ప్రధానంగా దేశంలోని సామాన్యం ప్రజలను ఈ సారి ఫోకస్ చేస్తూ తీసుకురాబడిన సంగతి తెలిసిందే.

ప్రధాన ప్రకటనలను పరిశీలిస్తే 2025 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యతరగతికి పెద్ద ఉపశమనం కల్పించారు. ఈ క్రమంలో ఆమె ప్రజల వద్ద వినియోగానికి అధిక నిధుల లభ్యతను పెంచేందుకు.. కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.7 లక్షల నుండి రూ.12 లక్షలకు పెంచటం జరిగింది. ప్రభుత్వ ఈ నిర్ణయం పన్ను చెల్లింపుదారులకు ఎంతో ఉపశమనం కలిగించింది. ప్రధానంగా హై పెయిడ్ ఉద్యోగాలు చేస్తున్న ఐటీ రంగంలోని ఉద్యోగులకు దీని నుంచి పెద్ద ప్రయోజనం దక్కింది.

Investors should know these sectors for post budget investment according to motilal oswal

ఈ క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్లు పెట్టుబడిదారులు ఏఏ రంగాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు, బడ్జెట్ తర్వాత ఎలా ముందుకు సాగాలని ఆలోచిస్తున్నారు. దీనిపై ప్రముఖ దేశీయ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్ రామ్‌దేవ్ అగర్వాల్ స్పందిస్తూ.. తాజా బడ్జెట్లో ప్రభుత్వ నిర్ణయం వినియోగాన్ని పెంచడం ద్వారా మూలధన మార్కెట్‌కు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందన్నారు. ఈ నిర్ణయం FMCG వంటి రంగాలు లేదా చిన్న వస్తువులతో వ్యవహరించే జొమాటో వంటి కంపెనీలు ప్రయోజనం పొందే అవకాశం ఉందని అగర్వాల్ అభిప్రాయపడ్డారు. పన్నుల తగ్గింపు వల్ల కన్స్యూమర్ డ్యూరబుల్ కంపెనీలకు ప్రయోజనం దక్కుతుందని చెబుతున్నారు.

రూ.25 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ సంపాదన కలిగిన వ్యక్తులు తమ ఆదాయాన్ని ఖర్చు చేయవలసిన అవసరం లేదని అగర్వాల్ అన్నారు. అటువంటి పరిస్థితిలో వారు పన్ను ఆదా ద్వారా వచ్చే డబ్బులో ఎక్కువ భాగాన్ని మూలధన మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చని పేర్కొన్నారు. క్విక్ కామర్స్ కంపెనీలు ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. జెప్టో, బ్లికింట్, టాటా బిగ్ బాస్కెట్, ఇన్ స్టామార్ట్ వంటి కంపెనీలు మంచి గ్రోత్ నమోదు చేయగలవని అంచానలను వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో పాత కంపెనీలకు ఆదాయ వృద్ధి నెమ్మదిగా ఉన్నప్పటికీ విలువలు ఎక్కువగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఇటువంటి పరిస్థితుల్లో తాను డిజిటల్ అండ్ క్విక్ కామర్స్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతానని రామ్‌దేవ్ అగర్వాల్ అన్నారు. ఈ కంపెనీల వృద్ధి రేటు గరిష్టంగా 10-15% ఉండవచ్చని అంచనాలను బయటపెట్టారు. దీంతో బడ్జెట్ ప్రసంగం తర్వాత ఇన్వెస్టర్లు సైతం జాగ్రత్తగా పెట్టుబడులపై ముందుకు వెళ్లాలని చూస్తున్నట్లు వెల్లడైంది.

Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+