Stock Market: గతవారం మార్కెట్లు మిశ్రమంగా కదిలాయి. అయితే కీలకమైన సెన్సెక్స్, నిఫ్టీ లాంటి సూచీలు నష్టాలతో క్లోజ్ అయ్యాయి. చాలా కంపెనీల మార్కెట్ క్యాప్ సైతం క్షీణించింది. అయితే వచ్చే వారం విడుదల కానున్న కొన్ని గణాంకాల కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

తప్పక గమనించాల్సిందే..
వచ్చే వారం అన్నింటికన్నా చాలా ముఖ్యమైనది ద్రవ్యోల్బణానికి సంబంధించిన వివరాలు వెల్లడి కావటమే. కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) ద్రవ్యోల్బణం అత్యంత ముఖ్యమైనది. గడచిన నాలుగు నెలలుగా ఇది రిజర్వు నిర్ధేశించుకున్న పరిమితుల్లోనే ఉంది. జనవరిలో CPI ద్రవ్యోల్బణం స్థిరంగా ఉంటుందని భావిస్తున్నట్లు బార్క్లేస్‌కు చెందిన రాహుల్ బజోరియా అన్నారు. జనవరి టోకు ధరల సూచిక (WPI) డేటా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. అలాగే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, విదేశీ మారక నిల్వల డేటా కూడా విడుదల కానుంది.

అమెరికా ద్రవ్యోల్బణం..
ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ముందుగా పెద్దన అమెరిగా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఎలా ఉందనేదానిపై ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నాయి. అయితే ఈ వివరాలు ఫిబ్రవరి 14న మార్కెట్లోకి విడుదల కానున్నాయి. రానున్న నెలలో ఫెడ్ తన వడ్డీ రేట్లను పెంచటానికి ఇది చాలా కీలకమైన అంశం. అమెరికా బాండ్స్ ఈల్డ్ పెరగటం, ఉద్యోగాల డేటా ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్న వాటిలో చాలా ముఖ్యమైన అంశాలుగా ఉన్నాయి.

చమురు ధరలు..
భారత ఆర్థిక వ్యవస్థలో చాలా కీలకమైనవి చమురు ధరలు. రష్యాపై ఆంక్షలు ఉన్నప్పటికీ ఇండియా తన ఆర్థిక ప్రయోజనాలకు అనుగుణంగా భారీగానే చమురును దిగుమతి చేసుకుంటోంది. ప్రధానంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత చమురు ధరలు చాలా వరకు పెరిగాయి. గతవారం బ్యారెల్ చమురు ధర 80 డాలర్ల స్థాయిని దాటి శుక్రవారం 86.52 డాలర్లకు చేరుకుంది. దాదాపు రెండున్నర నెలల నుంచి చమురు బ్యారెల్ ధర 90 డాలర్ల స్థాయి కంటే తక్కువగానే ఉంది. కానీ ఇప్పటికీ ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలను మాత్రం కేంద్ర ప్రభుత్వం తగ్గిచటం లేదని తెలుస్తోంది.

Q3 ఫలితాల సీజన్..
భారత మార్కెట్లకు సంబంధించి వాహనాల విక్రయాల డేటా త్వరలోనే విడుదల కానుంది. దీనికి తోడు దాదాపు 1500 కంపెనీలు తమ త్రైమాసిక ఫలితాలను వచ్చే వారం విడుదల చేయనున్నాయి. వీటిలో Nykaa, Adani Enterprises, Eicher Motors, Grasim Industries, ONGC, Simens, Nestle India వంటి ముఖ్యమైన కంపెనీలు కూడా ఉన్నాయి. వీటికి తోడు జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, సన్ ఫార్మా అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ కంపెనీ, శ్రీ రేణుకా షుగర్స్, సెయిల్, వోకార్డ్ట్, క్యాంపస్ యాక్టివ్‌వేర్, గుజరాత్ గ్యాస్, ఐఆర్‌బి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్లు, షాలిమార్ పెయింట్స్, అపోలో హాస్పిటల్స్, బాటా, భారత్ ఫోర్జ్, బయోకాన్, బాష్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఇప్కా లేబొరేటరీస్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్, స్పైస్‌జెట్ కూడా ఉన్నాయి.

విదేశీ ఇన్వెస్టర్లు..
ఇక చివరగా ఇన్వెస్టర్లు గమనించాల్సిన కీలక అంశం డబ్బును ఎఫ్ఐఐలు వెనక్కి తీసుకోవటం గురించే. జనవరిలో గణనీయమైన అవుట్‌ఫ్లో తర్వాత ఫిబ్రవరిలో ఎఫ్‌ఐఐల విక్రయాలు మందగించాయి. అయితే ప్రస్తుతం భారత మార్కెట్లలో తమ పెట్టుబడులను ఉపసంహరించుకుని చైనా, సౌత్ కొరియా, హాంకాంగ్ వంటి చీప్ మార్కెట్లలో దీర్ఘకాలం పెట్టుబడులు పెట్టి లాభాలను ఆర్జించాలని విదేశీ పెట్టుబడులు యోచిస్తున్నట్లు ప్రముఖ బ్రోకరేజ్ అంచనా వేస్తోంది. ఇలాంటి కీలకమైన విషయాలు వచ్చేవారం మార్కెట్లను ప్రభావితం చేయనున్నందున ఇన్వెస్టర్లు వీటిని తప్పక పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
More From GoodReturns

బంగారం, భూమి, స్టాక్ మార్కెట్.. ఈ ఏడాది తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు అందించే బెస్ట్ ఆప్షన్ ఏదంటే..

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. ట్రంప్ ప్రకటనతో షేర్ మార్కెట్లో పుల్ జోష్..

HDFC Bank ఫలితాలు: సోమవారం మార్కెట్ భారీగా పడిపోతుందా?

Paskistan: పాకిస్థాన్‌కు కోలుకోలేని దెబ్బ! చర్చలు విఫలం కావడంతో రూ. 78,000 కోట్లు గల్లంతు! ఎలాగంటే..

Stock market: వర్షం పడితేనే స్టాక్ మార్కెట్లో లాభాల పంట! మాన్సూన్ ఎఫెక్ట్ వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

Stock Market: సెన్సెక్స్ టాప్ లూజర్స్ ఇవే.. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలా, లేక ఇన్వెస్ట్ చేయాలా?

విప్రో ఫలితాల వేళ ఇన్వెస్టర్లకు భారీ షాక్ తప్పదా?

Stock market: ఐటీ స్టాక్స్ క్రాష్! నిఫ్టీ ఐటీ ఇండెక్స్ డౌన్.. భారీ నష్టాల్లో టాప్ కంపెనీలు!

స్టాక్ మార్కెట్ సెలవు: బుధవారం భారీ యాక్షన్ గ్యారెంటీనా?

భారత స్టాక్ మార్కెట్: ద్రవ్యోల్బణం డేటాతో భారీ కుదుపులు తప్పవా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications