Stock Market Next Week: గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో పాటు భారీ నష్టాలను సైతం చూశాయి. వాస్తవానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు మార్కెట్లను పెద్ద ర్యాలీకి పొరిగొల్పాయి. ఆ తర్వాత యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు సైతం ప్రకటించబడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇన్వెస్టర్ల చూపు రానున్న వారంలో మార్కెట్లు ఎలా ఉండనున్నాయనే దానిపైనే ఉంది.
అయితే భారతీయ మార్కెట్లలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న ప్రధాన అంశం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు మార్కెట్లను విడిచి వెళ్లిపోవటమే. ప్రస్తుతం వారి పెట్టుబడులు దేశీయ మార్కెట్లలో 12 ఏళ్ల కనిష్ఠానికి పడిపోవటం ఆందోళనలు కలిగిస్తోంది. అక్టోబరులో వీరు దేశీయ బ్యాంకింగ్ స్టాక్స్ నుంచి ఏకంగా రూ.26 వేల కోట్లను వెనక్కి తీసుకున్నట్లు తేలింది. వరుసగా 29 రోజుల పాటు వరుసగా వారు భారతీయ మార్కెట్లలో విక్రయాలను కొనసాగించారు. ఈ కాలంలో రూ.1.41 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు తేలింది. అయితే మళ్లీ ఎఫ్ఐఐలు తిరిగి పెట్టుబడులను భారతీయ మార్కెట్లోకి తీసుకొస్తారని విషయం మాత్రం ఎవరికీ అంతుపట్టని ప్రశ్నగా మారిపోయింది.

దీని తర్వాత ఈవారం మార్కెట్లను ప్రభావితం చేయనున్న అంశాలను పరిశీలిస్తే సెప్టెంబర్ త్రైమాసిక కార్పొరేట్ ఫలితాలు, గ్లోబల్ ట్రెండ్స్, దేశీయ ఐపీవో మార్కెట్లో పరిణామాలు అంటే కొత్త ఇష్యూల ప్రారంభంతో పాటు స్టాక్ మార్కెట్ లిస్టింగులపై అందరి దృష్టి కొనసాగుతోంది. ఇదే క్రమంలో గతవారం యూఎస్ ఫెడరల్ రిజర్వు 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచటం కొంత సపోర్ట్ అందిస్తున్న అంశంగా జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి వినోద్ నాయర్ పేర్కొన్నారు. ఇక్కడ ఇన్వెస్టర్లు గమనించాల్సిన మరో విషయం శుక్రవారం గురునానక్ జయంతి సందర్భంగా మార్కెట్లకు సెలవు ఉండటం.
దేశీయ సీపీఐ డేటాతో పాటు ఐఐపీ డేటా నవంబర్ 12న విడుదల కానున్నట్లు స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా అన్నారు. అలాగే హోల్ సేల్ ప్రైస్ ఇండెక్స్ డేటా నవంబర్ 14న వస్తున్నందున ఇన్వెస్టర్ల దృష్టి ఈ డేటాపై ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే క్రమంలో భారతీయ ఇన్వెస్టర్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో అంశం నవంబర్ 13న విడుదల అవనున్న యూఎస్ ద్రవ్యోల్బణం డేటా గురించే. గతవారం వడ్డీ రేట్ల తగ్గింపు తర్వాత ఈ ప్రకటన రావటంతో ప్రభావం ఎలా ఉండనుందని విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక క్యూ2 ఫలితాల ప్రకటనకు కొన్ని పెద్ద కంపెనీలు ఈవారం సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా, BEML, హిండాల్కో ఇండస్ట్రీస్, ONGC, అపోలో టైర్స్, బ్రెయిన్‌బిజ్ సొల్యూషన్స్ త్రైమాసిక ఫలితాలు ఈ వారంలో ప్రకటించబడనున్నాయని వెల్లడైంది. ఈ నెలలో కూడా ఎఫ్‌ఐఐల నిరంతర విక్రయమే భారత మార్కెట్ బలహీనతకు ప్రధాన కారణంగా జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వికె విజయకుమార్ పేర్కొన్నారు. అలాగే చైనా ఆర్థిక గణాంకాల కోసం కూడా దేశీయ ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా ఎఫ్ఐఐలతో పాటు దేశీయంగా బడా ఇన్వెస్టర్లు సైతం ప్రస్తుతం చైనా మార్కెట్లలో తమ పెట్టుబడులను కొనసాగించటం కోసం విక్రయాలను కొనసాగించటం దేశీయ ఈక్విటీ మార్కెట్లలో నష్టాలను పెంచుతోందని వెల్లడైంది.
అమెరికాలో ట్రంప్ గెలుపు తర్వాత బాండ్ ఈల్డ్స్ పెరిగాయి. ఇది భారతీయ రూపాయి విలువను మరింతగా ఒత్తిడికి గురిచేస్తూ పతనానికి దారితీస్తోంది. అమెరికా కోర్ సీపీఐ అక్టోబర్ డేటా, అమెరికా నిరుద్యోగిత డేటా, అమెరికా రిటైల్ విక్రయాల డేటా, యూకే జీడీపీ, చైనా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ వంటి అనేక అంశాలు ఈవారం దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!



Click it and Unblock the Notifications