Markets Next Week: గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు బుల్ జోరుతో రికార్డుల మోత మోగించాయి. నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు తమ జీవితకాల గరిష్ఠ రికార్డులను అవే అధిగమిస్తూ కొత్త శిఖరాలకు చేరుకున్నాయి.
అయితే ఇప్పుడు ఇన్వెస్టర్ల ఆలోచన మార్కెట్లు ఈ వారం కరెక్షన్ కి గురవుతాయా లేక బుల్ జోరు మరింత కాలం కొనసాగుతుందా అనేదే. మరో పక్క అమెరికా మార్కెట్లు కూడా సానుకూలంగా ఉండటం ఆసియా మార్కెట్లకు కొంత ఊరటను కలిగిస్తోంది. ఈ క్రమంలో మార్కెట్లను ముందుకు నడిపే కొన్ని కీలక అంశాల గురించి ఇప్పుడు తప్పక తెలుసుకోవాలి. అసలు వచ్చేవారం ట్రేడింగ్ చెయ్యాలా..? వద్దా..? అనే క్లారిటీ కావాలంటే ఈ అంశాలను తప్పక తెలుసుకోవాల్సిందే.

బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ తాజా రికార్డు స్థాయిలను తాకడంతో గత వారం భారతీయ ఈక్విటీ మార్కెట్లకు విశేషమైనదిగా మారింది. ఈక్రమంలో రానున్న వారం దేశీయ మార్కెట్లలోని ఇన్వెస్టర్లు విడుదల కానున్న S&P గ్లోబల్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ PMI, సర్వీసెస్ PMI, కాంపోజిట్ PMI, నెలవారీ ఆటోమొబైల్ రంగ విక్రయాలు, US ట్రేడ్ బ్యాలెన్స్ వంటి ప్రధాన ఆర్థిక డేటా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా విడుదల చేయనున్న బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, ఇనిషియల్ జాబ్‌లెస్ క్లెయిమ్‌లు, S&P గ్లోబల్ సర్వీసెస్ PMI ఫైనల్, ISM సర్వీసెస్ PMI, ISM సర్వీసెస్ ఎంప్లాయ్‌మెంట్, వ్యవసాయేతర పేరోల్స్, నిరుద్యోగిత రేటు వంటివి కీలకం కానున్నాయి.
మెుదటి త్రైమాసికంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే చాలా బలమైన వృద్ధిని నమోదు చేయటం మాంద్యం భయాలను తగ్గిస్తోంది. వాణిజ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం జనవరిలో యూఎస్GDP 2 శాతం వార్షిక వేగంతో పెరిగింది. గతవారం దేశీయ మార్కెట్లలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 44,500 మార్కును అధిగమించటంతో వరుసగా మూడు రోజుల పాటు లాభాల్లో నిలిచిందని LKP సెక్యూరిటీస్‌లో సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ రూపక్ దే వెల్లడించారు. అలాగే బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ నాలుగు వరుస సెషన్లలో భారీగా 2.8 శాతం లాభపడింది. రాబోయే వారంలో నిఫ్టీ 19500 స్థాయిలకు చేరుతుందని ఆశించవచ్చని అంచనా వేశారు.
ఎఫ్‌ఐఐల నుంచి బలమైన పెట్టుబడి ఇన్‌ఫ్లోలు, హెచ్‌డీఎఫ్‌సీ విలీనం, కరెంట్ ఖాతా లోటు తగ్గడం మార్కెట్లు ఊపందుకునేందుకు మద్దతునిచ్చాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. అమెరికాలో నిరుద్యోగిత రేటు తగ్గుదల, బ్యాంకింగ్ ఒత్తిళ్లు తగ్గటం కలిసొచ్చాయి. దీంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరిగింది. ప్రధానంగా ఐటీ, ఆటో, ఫార్మా రంగాల షేర్లు గతవారం మెరుగైన పనితీరును కనబరిచి భారత స్టాక్ ఇన్వెస్టర్లను ధనవంతులు చేశాయి. ఇదే క్రమంలో మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ నష్టాల నుంచి కోలుకున్నాయని తెలిపారు.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications