Stock Market: మార్కెట్ల పతనం వెనుక 7 కారణాలు..?? రేపటి నుంచి జాగ్రత్త ట్రేడర్స్..

Stock Market: అక్టోబర్ 7న అకస్మాత్తుగా ప్రారంభమైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. దసరా సెలవు కారణంగా నేడు మార్కెట్లు మూతపడినప్పటికీ నిన్న భారీ నష్టాలను నమోదు చేశాయి.

సోమవారం భారత మార్కెట్లు భారీగా పతనం కావటంతో ఇన్వెస్టర్లు రూ.7.59 లక్షల కోట్ల మేర నష్టపోయారు. వరుసగా నాలుగో సెషన్ మార్కెట్లు క్షీణించటంతో మెుత్తంగా సెన్సెక్స్ 1,925 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో మరో మార్కెట్ బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ 530 పాయింట్లు పడిపోయింది. అసలు మార్కెట్ల అల్లకల్లోలం వెనుక ఏడు ప్రధాన కారణాలు ఉన్నాయని నిపుణులను చెబుతున్నారు. వీటని పరిశీలిస్తే..

Investors should know 7 reasons behind indian stock markets crash on monday, trade carefully

- ముందుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ వివాదం దేశీయ స్టాక్ మార్కెట్లలోని ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. ఇది అంతర్జాతీయ మార్కెట్లను సైతం అనిశ్చితికి గురిచేస్తోంది. వార్ స్కోప్ పెరుగుతుందనే భయంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు కుప్పకూలుతున్నాయి.

- ఇదే సమయంలో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వడ్డీ రేట్ల విధానంపై చేసిన వ్యాఖ్యల కారణంగా యూఎస్ బాండ్స్ ఈల్డ్స్ 16 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఈ ఏడాది వడ్డీ రేట్లు మరింత పెరగవచ్చని ఫెడ్ పేర్కొంది. ప్రస్తుతం ఇది 5 శాతం కంటే ఎక్కువగా ఉంది. 2007లో బాండ్స్ ఇదే స్థాయిలో ట్రేడయ్యాయి.

- ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 90 డాలర్లకు పైనే ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఒపెక్ దేశాల కూటమి ఉత్పత్తి తగ్గించటంతో ధరలు పెరుగుతున్నాయి. రానున్న కాలంలో 100 డాలర్ల మార్కును చేరుకుంటుందని చాలా మంది నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తోందని చాలా దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

- బాండ్స్ మార్కెట్ బూమ్ కారణంగా చాలా మంది విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను భారత మార్కెట్లలో విక్రయిస్తున్నారు. అక్టోబర్ మాసంలో ఇప్పటి వరకు 12,000 కోట్లకు పైగా విలువైన పెట్టుబడులను వదులుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పట్లో ఇది ఆగే సూచనలు కనిపించటం లేదు.

- గడచిన వారం రోజులుగా అమెరికా డాలర్ ఇండెక్స్ 106 పాయింట్లకు పైన ట్రేడవుతోంది. అనిశ్చితులు పెరుగుతున్న వేళ డాలర్ డిమాండ్ పెరుగుతోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల కరెన్సీల విలువ క్షీణిస్తోంది. ఈ ప్రభావం రూపాయి మారకపు విలువపై కూడా కనిపిస్తోంది.

- భారత్ తన ఇంధన అవసరాల కోసం అత్యధికంగా క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం పెరుగుతున్న ధరలు భారత ప్రభుత్వ ఆదాయంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.

- ఇక చివరిగా దేశంలో కార్పొరేట్ కంపెనీలు తమ సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు వచ్చిన విప్రో, ఇన్ఫోసిస్, డిమార్ట్ వంటి ప్రముఖ కంపెనీల ఫలితాలు బలహీనంగా ఉండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్లను ప్రభావితం చేస్తున్నాయి. దీంతో కొనుగోళ్లు మందగించాయి. ఇలా పైన పేర్కొన్న అనేక దేశీయ, అంతర్జాతీయ పరిణామాలు భారత స్టాక్ మార్కెట్ల నష్టాలకు కారణాలుగా నిలుస్తున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+