Trending Stocks: టూ-వీలర్ స్టాక్స్‌పై ఇన్వెస్టర్ల మనసు.. ప్రమాదకర నిర్ణయమా..??
Trending Stocks: ఇటీవలి కాలంలో మార్కెట్లో పవర్, టూవీలర్స్, డిఫెన్స్, రైల్వేలు వంటి అనేక రంగాల షేర్లు పెట్టుబడిదారులకు మంచి లాభాలను తెచ్చిపెట్టాయి. ఈ క్రమంలో ఆటోమోటివ్ రంగం పరిస్థితి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
దేశంలో ద్రవ్యోల్బణం కారణంగా ధరల పెరుగుదల ఉన్నప్పటికీ.. గ్రామీణ డిమాండ్ మంచిగానే నమోదైంది. ఈ క్రమంలో టూ-వీలర్ కంపెనీలైన ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, TVS మోటార్స్ షేర్లు గత ఆరు నెలల్లో గణనీయమైన వృద్ధిని కనబరిచాయి. కానీ ఈ రంగం షేర్లలో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులకు సంభావ్య నష్టాల గురించి ఆందోళనలు పెరుగుతున్నాయి.

TVS మంచి మార్జిన్ డెలివరీ, బజాజ్ మరియూ హీరో మోటార్స్ సంస్థలు ప్రీమియం వాహనాలను ప్రారంభించడం వంటి అంశాలు పెట్టుబడిదారుల మానసిక ధైర్యాన్ని ఇస్తున్నాయి. అయితే మార్కెట్లో డిమాండ్ సమస్యలు, ముడి సరకుల పెరుగుదలతో మార్జిన కష్టాలు రానున్న కాలంలో వచ్చే ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ద్విచక్ర వాహనాల ఎగుమతి బజాజ్ కంపెనీకి చాలా కీలకమైనది. ప్రస్తుతం వాహనాల ఎగుమతి సంఖ్యలు ఇంకా పుంజుకోలేదు. పోటీ పెరుగుదల, పెరిగిన ఉక్కు ధరలు, ఎలక్ట్రిక్ వాహనాలలో రాంప్-అప్ వంటి అంశాలు లాభదాయకతకు ముప్పును కలిగిస్తాయవు తెలస్తోంది.

షేర్ల ధరలు పుంజుకున్నప్పటికీ.. బజాజ్, హీరో మోటార్స్ కంపెనీల వాహన విక్రయాల సంఖ్య కరోనా కంటే ముందు స్థాయిల కన్నా తక్కువగానే కొనసాగుతోంది. ఇంధన ధరలు పెరుగుదలతో పాటు పెరుగుతున్న అవగాహనతో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలకు షిఫ్ట్ అవుతుండటం దీనికి విక్రయాల తగ్గుదలకు మరో కారణంగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో బ్రోకరేజ్ సంస్థలు సైతం ఇన్వెస్టర్ల అత్యుత్సాహంపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. అందువల్ల టూవీలర్ కంపెనీల షేర్లతో అప్రమత్తంగా ఉండాల్సిన సమయంగా వారు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications