Investment Tip: నష్టాలు రాకూడదంటే ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలో ఈ 5 తప్పులు అస్సలు చేయెుద్దంటున్న నిపుణులు..
డబ్బును ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక రాబడిని పొందాలనేది ప్రతి పెట్టుబడిదారుడి కల. మంచి రాబడిని పొందడానికి లేదా నష్టాలను నివారించడానికి డబ్బును పెట్టుబడి పెట్టేటప్పుడు ఏమి చేయాలో నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.

ద్రవ్యోల్బణాన్ని లెక్కించకపోవటం:
పెట్టుబడి కోసం ద్రవ్యోల్బణాన్ని తప్పక పరిగణలోకి తీసుకోవాలి. ఖచ్చితమైన మొత్తాన్ని లెక్కించడం చాలా ముఖ్యం. ప్రస్తుత కాలంలో ద్రవ్యోల్బణం అంశం లేకపోయినట్లయేతే ఖర్చులకోసం రూ.50,000 ఆదాయం మంచిదే. 65 సంవత్సరాల వయస్సు నాటికి.. 7% ద్రవ్యోల్బణం రేటు ప్రకారం.. రూ. 70,000 ఆదాయం అవసరం. అయితే 70 సంవత్సరాల వయస్సు వరకు నెలకు రూ. 1 లక్ష ఆదాయం అవసరమని నిపుణులు చెబుతున్నారు.

లక్ష్యం లేని పెట్టుబడి:
ఫిన్‌సేఫ్ వ్యవస్థాపకుడు పెట్టుబడిదారులకు లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని పెట్టుబడి పెట్టాలని సలహా ఇస్తున్నారు. ప్రతి పెట్టుబడిదారుడు షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ లక్ష్యాలను కలిగి ఉంటారు. కాబట్టి ఈ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడి పెట్టడం మంచిది. కారు, ఇల్లు, విహారయాత్రల కోసం సేవ్ చేయటం లేదా పిల్లల చదువులు, వివాహాల వంటి లక్ష్యాల కోసం పెట్టుబడి ప్రణాళిక చేసుకోవటం. ఇది షార్ట్ టర్మ్ లక్ష్యమా లేదా లాంగ్ టర్మ్ లక్ష్యమా అనే దానికి తదనుగుణంగా పెట్టుబడి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఎక్కువ కాలానికి పెట్టుబడి పెట్టడం మంచిదని వారు అంటున్నారు. అలాగే రిటైర్‌మెంట్ కోసం ముందుగా లక్ష్యాలను నిర్దేశించుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

గ్యారెంటీడ్ రిటర్న్స్ ఆశించండి:
పెట్టుబడులకు ఎక్కువ రాబడి సంపాదించాలనే దురాశతో ఇన్వెస్ట్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. డబ్బు సంపాదించడానికి షార్ట్‌కట్ లేదు. మార్కెట్‌లో హెచ్చు తగ్గులు ఉంటాయి.. ఈ కదలికల ప్రకారం రాబడులు ప్రభావితమవుతాయి. అందువల్ల పెట్టుబడి లాంగ్ టర్మ్, లక్ష్యం ఆధారంగా ఉంటే నష్టం తక్కువగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

గొర్రెల్లా పెట్టుబడులు వద్దు:
పెట్టుబడి పెట్టేటప్పుడు ఇతరులను కాపీ కొట్టవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న మార్కెట్‌లో డబ్బును పెట్టుబడి పెట్టడం, డౌన్ మార్కెట్‌లో లాభాలను బుక్ చేసుకోవడం ఒక పద్ధతి కాదు. గుంపులో భాగమై పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవటం హాని కలిగిస్తుందని వారు సూచిస్తున్నారు. మార్కెట్ పెరిగినా, తగ్గినా.. ఇన్వెస్టర్ తన వ్యూహం ప్రకారం పెట్టుబడి పెట్టాలని నిపుణులు చెబుతున్నారు.

పనితీరును చూసి పెట్టుబడి పెట్టండి:
పెట్టుబడి పెట్టే ముందు రాబడులను చూసుకుంటే సరిపోదని నిపుణులు అంటున్నారు. నిజానికి పెట్టుబడి చేస్తున్న సమయంలో దాని పనితీరును పూర్తిగా అర్థం చేసుకోవాలని అంటున్నారు. పెట్టుబడికి సంబంధించి సరైన అవగాహన కోసం ఫండ్ ఫ్యాక్ట్ షీట్ ఇన్వెస్టర్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. దీనికి తోడు మీ లక్ష్యాలకు అనుగుణంగా సరిపోయే ఫండ్‌ను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫండ్ ఫ్యాక్ట్‌షీట్‌లో ఫండ్ గురించి పూర్తి సమాచారం ఉందని.. దానిని తప్పక పరిశీలించాలని వారు అంటున్నారు. ఒక వేళ నిర్ణయం తీసుకునేందుకు అవసరమైతే ఆర్థిక సలహాదారు సహాయం తీసుకోవాలని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications