Trading Trouble: దేశంలో డిస్కౌంట్ బ్రోకింగ్ ప్రవేశపెట్టి పెద్ద సక్సెస్ రుచిచూసిన సంస్థగా జెరోధా నిలిచింది. దీనిని కామత్ బ్రదర్స్ ప్రారంభించగా.. ఇప్పటికే లక్షల సంఖ్యలో యాక్టివ్ ఇన్వెస్టర్లను కంపెనీ కలిగి ఉంది.
డీమ్యాట్ ఖాతాల సంఖ్యలో రెండవ స్థానానికి ఇటీవల దిగజారినప్పటికీ ట్రేడింగ్ కొనసాగిస్తున్న అధిక ఇన్వెస్టర్లు కలిగిన కంపెనీగా మాత్రం అందరి కంటే ముందు స్థానంలో కొనసాగుతోంది. అయితే తరచుగా జెరోధా కైట్ యాప్ వినియోగదారులు టెక్నికల్ గ్లిచ్ లేదా యాప్ క్రాష్ వంటి ఇబ్బందులను ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్నారు. ఈ రోజు ఉదయం సైతం వారికి ఇదే పరిస్థితి ఎదురుకావటంతో చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సోమవారం నాడు జెరోధా వినియోగదారులు తమ ఖాతాల్లో తమ హోల్డింగ్‌లు, ట్రేడ్‌లు వంటి వివరాలను చూడలేకపోతున్నామంటూ సోషల్ మీడియా వేదికల్లో పోస్టులు చేశారు. తమ పొజిషన్లు క్లోజ్ చేసుకునేందుకు యాప్ సహకరించకపోవటం వల్ల లాభాలకు బదులు నష్టాలు చవిచూసినట్లు.. ఇలా చేసినందుకు జెరోధాకు ధన్యవాదాలంటూ ఒక వినియోగదారుడు పోస్ట్ చేశాడు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు కస్టమర్ కేర్ సభ్యులను సంప్రదించటానికి చేసిన ప్రయత్నాలకు ఎవరూ రెస్పాండ్ కలేదంటూ మరో వినియోగదారుడు వెల్లడించాడు.
మార్కెట్లలో బుల్ జోరు కొనసాగుతున్న వేళ ఇలా జరగటంపై జెరోధా వినియోగదారులు సీరియస్‌గా ఉన్నారు. దీనిపై ఎట్టకేలకు స్పందించిన బ్రోకరేజ్ సంస్థ కనెక్టివిటీ సమస్య కారణంగా అంతరాయం ఏర్పడిందని బదులిచ్చింది. సమస్య పరిష్కరించబడిందని ఇలా జరిగినందుకు తాము చింతిస్తున్నామంటూ ఒక ప్రకటన విడుదల చేసింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications