Panabyte Technologies: మోదీ సర్కార్ 3.0 వస్తుందని కన్ఫమ్ అవ్వటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు చెలరేగిపోతున్నాయి. దీంతో మార్కెట్లు ఎన్నికల ఫలితాల రోజున కుప్పకూలినప్పటికీ తిరిగి వేగంగా పుంజుకున్నాయి. ఈ క్రమంలో ఒక స్టాక్ కొనేందుకు ఇన్వెస్టర్లు ఎగబడటం అందరినీ ఆకర్షిస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది పనాబైట్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించే. శుక్రవారం ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో Panabyte Technologies షేర్లు ఫోకస్‌లో కొనసాగాయి. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ వస్తువులు, IT హార్డ్‌వేర్ సేవల్లో కంపెనీ షేర్లు నిన్న 6% పెరిగి ఒక్కో షేరు ధర రూ.25.54 వద్ద ముగిసింది. అయితే అనూహ్యంగా కంపెనీ షేర్లలో పెరుగుదలకు కారణం టాటా గ్రూప్ నుంచి పొందిన పెద్ద ఆర్డర్ కారణంగా తెలుస్తోంది. దీంతో నిన్న కంపెనీ మార్కెట్ క్యాప్ భారీ పెరుగుదలను నమోదు చేసింది.

పనాబైట్ టెక్నాలజీస్ టాటా మెమోరియల్ సెంటర్ - అడ్వాన్స్‌డ్ సెంటర్ ఫర్ ట్రీట్‌మెంట్, రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్ (ACTREC) నుంచి టెస్టింగ్ అండ్ కమీషనింగ్ కోసం ఆర్డర్‌ను అందుకుంది. ఈ ఆర్డర్ విలువ రూ.3.63 లక్షలుగా ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం పానాబైట్ టెక్నాలజీస్ టాటా మెమోరియల్ సెంటర్ - అడ్వాన్స్‌డ్ సెంటర్ ఫర్ ట్రీట్‌మెంట్, రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్ నుంచి CCTVల సరఫరా, ఇన్‌స్టాలేషన్, టెస్టింగ్ అండ్ కమీషన్ కోసం తాజా ఆర్డర్‌ను అందుకుంది.
పనాబైట్ టెక్నాలజీ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం ఏడాది ప్రాతిపదికన మార్చి త్రైమాసికంలో 57 శాతం క్షీణించింది. ఎఫ్‌వై22-23లో రూ.8.87 కోట్ల నుంచి ఎఫ్‌వై23-24లో రూ.3.75 కోట్లకు పడిపోయింది. మరోవైపు నికర నష్టం FY23-24లో రూ.0.46 కోట్లకు చేరుకుంది. మార్చి 2024 నాటికి కంపెనీలో ప్రమోటర్లకు 17.03 శాతం, ఇన్వెస్టర్లకు 82.97 శాతంగా ఉంది. 1981లో స్థాపించబడిన పానాబైట్ టెక్నాలజీస్ వినియోగదారు ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ వస్తువులు, IT హార్డ్‌వేర్ అండ్ పెరిఫెరల్స్, పరిశుభ్రత ఉత్పత్తులు వంటి బహుళ ఉత్పత్తుల పంపిణీదారుల వ్యాపారంలో చురుకుగా ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications