అమెరికా అధ్యక్షుడిగా డెమోక్రటిక్ అభ్యర్థి జోబిడెన్ విజయం సాధించడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలోపేతం చేసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో విధాన పరమైన అనిశ్చితులు తొలగిపోతాయని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లు, ఆసియా మార్కెట్లకు తోడు భారత మార్కెట్లు దుమ్మురేపాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. సెన్సెక్స్ 704.37 పాయింట్లు(1.68%) ఎగిసి 42,597.43 వద్ద, నిఫ్టీ 197.50 పాయింట్లు(1.61%) లాభపడి 12,461 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంకింగ్, ఐటీ షేర్ల దూకుడు కూడా మార్కెట్ లాభాలకు దోహదపడింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద భారీగా పెరిగింది.

రూ.2 లక్షల కోట్ల సంపద అప్
సెన్సెక్స్, నిఫ్టీ దూకుడుతో ఇన్వెస్టర్ల సంపద రూ.2 లక్షల కోటలకు పైగా పెరిగింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,06,558.75 కోట్లు పెరిగి రూ.1,65,67,257.92 కోట్లకు పెరిగింది. సెన్సెక్స్, నిఫ్టీలు నిన్న జీవనకాల గరిష్టానికి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ఉండటంతో మన మార్కెట్లు కూడా ఈ వారం మంచి లాభాలతో ప్రారంభం అయ్యాయని, ప్రధానంగా జోబిడెన్ గెలుపు కలిసి వచ్చిందని రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్‌కు చెందిన అజిత్ మిశ్రా అన్నారు. బిడెన్ గెలుపు, బలమైన విదేశీ పెట్టుబడులు, అమెరికా ఆర్థిక ప్యాకేజీ ఆశల నేపథ్యంలో డొమెస్టిక్ మార్కెట్లు పుంజుకున్నాయన చాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా అన్నారు.

1485 కంపెనీలు లాభాల్లో
30 షేర్ ప్యాక్‌లో 28 స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. ఇండస్ ఇండ్ బ్యాంకు టాప్ గెయినర్‌గా నిలిచింది. ఆ తర్వాత భారతీ ఎయిర్ టెల్ ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, పవర్ గ్రిడ్, ఐటీసీ, మారుతీ ఉన్నాయి.
బీఎస్ఈ టెలికం, బ్యాంకెక్స్, పవర్, మెటల్, ఫైనాన్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, టెక్ సూచీలు 3.81 శాతం మేర పెరిగాయి. హెల్త్ కేర్ మాత్రం స్వల్పంగా నష్టపోయింది. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 1 శాతానికి పైగా లాభపడ్డాయి. బీఎస్ఈలో 1485 కంపెనీలు లాభాల్లో ముగియగా, 1206 కంపెనీలు నష్టాల్లో ముగిశాయి.

చమురు ధరల పెరుగుదల
కరోనా వ్యాక్సీన్ సమర్థతపై ఫైజర్ ప్రకటన కూడా మార్కెట్లకు కలిసి వచ్చాయి. డౌజోన్స్ 2.95 శాతం, ఎస్ అండ్ పీ 1.17 శాతం లాభపడడాయి. డాలర్ మారకంతో దేశీయ కరెన్సీ రూపాయి 7 పైసలు క్షీణించింది. నిన్న 73.95 వద్ద ప్రారంభమై, ఓ సమయంలో 73.83కు బలపడి, చివరకు 74.15 వద్ద ముగిసింది. ఇక, బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 4 డాలర్ల మేర పెరిగి 43డాలర్లకు చేరింది. కరోనా వ్యాక్సీన్ పైన ఆశల కారణంగా ఒపెక్ దేశాలు గతంలో కుదుర్చుకున్న క్రూడ్ ఉత్పత్తి తగ్గింపు ఒప్పందాన్న ప్రస్తుత డిమాండ్, సరఫరాకు తగినట్లు సర్దుబాటు చేసుకోనున్నారు. దీంతో క్రూడ్ ధర పెరిగింది. మార్కెట్లు పుంజుకోగా, పసిడి, గోల్డ్ ధరలు క్షీణించాయి.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్.. నిన్న లాభాలన్నీ ఆవిరి..పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!



Click it and Unblock the Notifications