గంటలో రూ.4 లక్షల కోట్ల నష్టం, 2 ఏళ్లలో ఇన్ఫోసిస్ ఇన్వెస్టర్లకు ఇదే భారీ షాక్

అంతర్జాతీయ, దేశీయ ప్రతికూల సంకేతాల కారణంగా భారత స్టాక్ మార్కెట్లు సోమవారం కుప్పకూలాయి. దేశీయంగా ద్రవ్యోల్భణం పదిహేడు నెలల గరిష్టానికి చేరుకున్నది. అమెరికా ద్రవ్యోల్భణం కూడా ఆందోళనకరంగా ఉండటం, ఫెడ్ వడ్డీ రేటు పెంపు అభిప్రాయాలు మార్కెట్ పైన ప్రభావం చూపుతున్నాయి. రష్యా-ఉక్రెయన్ పరిణామాలపై ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు. చైనాలో ఆర్థిక వృద్ధి గత త్రైమాసికంలో మందగించినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ఇవి కూడా మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీశాయి. దీంతో దేశీయ సూచీలు నష్టాల్లో ట్రేడ్ ఉన్నాయి.

అంతకంతకూ నష్టాలు

అంతకంతకూ నష్టాలు

మధ్యాహ్నం గం.11 సమయానికి సెన్సెక్స్ 1243 పాయింట్లు లేదా 2.13 శాతం క్షీణించి 57,090 పాయింట్ల వద్ద, నిఫ్టీ 328 పాయింట్లు లేదా 1.88 శాతం క్షీణించి 17,146 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ 57,000 పాయింట్ల దిగువకు వచ్చినట్లుగా కనిపించింది. కానీ ఈ మార్కుకు కాస్త పైన కదులుతోంది. నిఫ్టీ 17,150 పాయింట్ల దిగువకు పడిపోయింది. డాలర్ మారకంతో రూపాయి 76.39 వద్ద ఉంది. సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో ఎన్టీపీసీ, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ, పవర్ గ్రిడ్, ఐటీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ఇన్వెస్టర్లకు భారీ నష్టం

ఇన్వెస్టర్లకు భారీ నష్టం

దలాల్ స్ట్రీట్ ఇన్వెస్టర్లు నేడు కొద్ది గంటల్లోనే రూ.4 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు. త్రైమాసిక ఫలితాల అసంతృప్తి, అంతర్జాతీయ అననుకూల సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. దీంతో ఇన్వెస్టర్లు రూ.4 లక్షల కోట్ల మేర నష్టపోయారు.ఇన్ఫోసిస్ స్టాక్స్ నేడు 7.5 శాతం మేర క్షీణించింది.

నేడు ఒక్కరోజే (మధ్యాహ్నం గం.11 సమయానికి) ఈ స్టాక్ రూ.7.5 శాతం లేదా రూ.131 క్షీణించి రూ.1617 వద్ద ట్రేడ్ అయింది. ఈ స్టాక్ ఓ సమయంలో 9 శాతం మేర క్షీణించి రూ.1592 వద్ద కూడా ట్రేడ్ అయింది. దీంతో ఇన్ఫోసిస్ ఇన్వెస్టర్లు రూ.40,000 కోట్ల నుండి రూ.48,000కోట్ల మేర నష్టపోయారు. మార్చి 23, 2020 తర్వాత ఇన్ఫోసిస్ స్టాక్‌కు ఇదే భారీ నష్టం.

రూ.4 లక్షల కోట్లు ఫట్

రూ.4 లక్షల కోట్లు ఫట్

బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ నేడు రూ.4 లక్షల కోట్ల మేర క్షీణించి రూ.272 లక్షల కోట్ల నుండి రూ.268 లక్షల కోట్లకు తగ్గింది. గతవారం గురు, శుక్రవారాలు మార్కెట్‌కు సెలవు. బుధవారంతో ముగిసిన రోజున బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ.272 లక్షల కోట్లుగా ఉంది. ఈ రోజు భారీగా తగ్గింది. మొదటి గంటలోనే మార్కెట్ ఈ మేరకు నష్టపోయింది. అప్పుడు సెన్సెక్స్ వెయ్యి పాయింట్లు క్షీణించింది. ఆ తర్వాత 1200 పాయింట్లకు పైగా నష్టపోయింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+