Stock Market: బడ్జెట్ అనగానే దేశంలోని ఇన్వెస్టర్లు మాత్రమే కాక విదేశీ పెట్టుబడిదారులు సైతం చాలా ఆసక్తిగా మార్కెట్లలోకి వచ్చారు. అయితే మార్కెట్లను, మార్కెట్లోని రంగాలను ప్రభావితం చేసే పెద్ద ప్రకటనలు కనిపించకపోవటంతో మార్కెట్ల జోష్ నీరుగారిపోయింది.

బడ్జెట్ నిరాశ..
ప్రధానంగా చూస్తే నిర్మలమ్మ బడ్జెట్ పారిశ్రామిక వర్గాల కంటే ప్రజారంజకమైన తాయిలాలలో కూడుకున్నదిగా ఉంది. రానున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి పూర్తి స్థాయి బడ్జెట్ కావటంతో కేంద్రం ప్రజలను మెప్పించేందుకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపించిందని మార్కెట్ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రక్షణ రంగం..
గ్రీన్ ఎనర్జీ, ఈవీ రంగాలకు సంబంధించినంత వరకు కొంత ప్రోత్సాహకాలు కనిపించాయి. అయితే సిగరెట్లపై టాక్సులు పెంచటంతో ఆ రంగంలోని చాలా కంపెనీ చాలా కంపెనీలు నష్టాలను చవిచూశాయి. ఇదే సమయంలో డిఫెన్స్ రంగానికి సంబంధి కూడా ఎలాంటి పెద్ద ప్రకటనలు కనిపించకపోవటం మార్కెట్ ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేశాయి. ప్రభుత్వం 2025 నాటికి రూ.1.75 లక్షల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. రక్షణ మంత్రిత్వ శాఖ అన్ని శాఖల కంటే అత్యధికంగా రూ. 5.94 లక్షల కోట్లను అందుకుంది.

ఎల్ఐసీ షేర్..
ఇదే సమయంలో బీమా రంగానికి సంబంధించి ఎలాంటి ప్రకటన లేకపోవటంతో ఆ రంగంలోని కంపెనీ నష్టాల్లో ముగిశాయి. ప్రధానంగా ప్రభుత్వ ఆధీనంలోని ఎల్ఐసీ షేర్లు సైతం భారీగానే నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో ఎల్ఐసీ షేర్ 8 శాతం మేర నష్టపోయి రూ.601 వద్ద ట్రేడింగ్ ముగించింది. ఈ క్రమంలో స్టాక్ ధర రూ.52.30 మేర క్షీణించింది. దీంతో ఎల్ఐసీ మార్కెట్ క్యాప్ రూ.3.79 లక్షల కోట్లుగా ఉంది. అదానీ షేర్ల పతనం నాటి నుంచి ఎల్ఐసీ షేర్ కూడా క్షీణిస్తోంది. అయితే అదానీలో పెట్టుబడుల వల్ల ఎలాంటి ఆర్థిక నష్టం కలగలేదని తెలుస్తోంది. ఇప్పటికీ ఆ పెట్టుబడులు లాభాల్లోనే ఉన్నాయని ఎల్ఐసీ స్పష్టం చేసింది.

నష్టాల్లో మార్కెట్ క్లోజ్..
ఉదయం నుంచి మనల్సి ఎవర్రా ఆపేది అన్నట్లు ఇన్వెస్టర్లు మార్కెట్లో కొనుగోళ్లను మెుదలు పెట్టారు. అయితే బడ్జెట్ ప్రకటనల్లో పసలేదని గ్రహించిన వారు అమ్మకాలకు మెుగ్గు చూపారు. ఇదే సమయంలో కొందరు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఈ క్రమంలో సెన్సెక్స్ సూచీ 158 పాయింట్ల లాభంలో ముగిసింది. ఇదే సమయంలో నిఫ్టీ సూచీ 45 పాయింట్లు నష్టాల్లో క్లోజ్ అయ్యింది. బ్యాంక్ నిఫ్టీ సూచీ సైతం 142 పాయింట్లు కోల్పోయింది. ఇక మిడ్ క్యాప్ నిఫ్టీ సూచీ 289 పాయింట్ల నష్టంతో క్లోజ్ కావటం ఇన్వెస్టర్ల నిరాశకు అద్దం పడుతోంది.
More From GoodReturns

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications