Vishal MegaMart IPO: ఈ సంవత్సరం అందరూ ఆత్రుతగా ఎదురుచూసిన ఐపీవో ఎట్టకేలకు వచ్చేస్తోంది. పెట్టుబడిదారులు ప్రస్తుతం ఈక్విటీల కంటే ఎక్కువగా ఐపీవోల నుంచే రాబడిని అందుకుంటున్న సంగతి తెలిసిందే. గట్టి లాభాలను తెచ్చిపెడుతున్న ఐపీవోలపై బెట్టింగ్ వేసేందుకు మీరు సిద్ధంగా ఉండే ఈ ఐపీవోకి సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకోవాల్సిందే..
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది విశాల్ మెగామార్ట్ కంపెనీ ఐపీవో గురించే. మెయిన్ కేటగిరీ ఐపీవో కింద వస్తున్న కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి ఏకంగా రూ.8000 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. ఈ ఐపీవో పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ కింద వస్తోంది. ఇందుకోసం కంపెనీ 102.56 కోట్ల షేర్లను ఇష్యూ చేస్తోంది. పెట్టుబడిదారుల సబ్ స్క్రిప్షన్ కోసం కంపెనీ ఐపీవో రానున్న వారంలో డిసెంబర్ 11న ప్రారంభం కాబోతోంది. ఇష్యూ డిసెంబర్ 13 వరకు పెట్టుబడిదారులకు అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఈ క్రమంలో కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.74 నుంచి 78గా నిర్ణయించింది.

ఈ క్రమంలో కంపెనీ తన ఐపీవో లాట్ పరిమాణాన్ని 190 షేర్లుగా ఉంచింది. దీని ప్రకారం ఎవరైనా ఇన్వెస్టర్ కంపెనీ ఐపీవోలో పెట్టుబడి పెట్టడానికి కనీసం రూ.14,820 అవసరం. కంపెనీ షేర్లు ఏకకాలంలో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో డిసెంబర్ 18న లిస్ట్ కానున్నాయని ప్రథమిక సమాచారం. కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ లిమిటెడ్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిమిటెడ్, ఇంటెన్సివ్ ఫిస్కల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, జెఫరీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, జేపీ మోర్గాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మోర్గాన్ స్టాన్లీ ఇండియా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఉన్నాయి. విశాల్ మెగా మార్ట్ IPO గ్రే మార్కెట్‌లో రూ.19 ప్రీమియంతో లభిస్తుంది. కంపెనీ తన షేర్ లిస్టింగ్‌లో 25% వరకు లాభాన్ని పొందవచ్చని అంచనాలు ఉన్నాయి.
కంపెనీ వ్యాపారం..
2001లో స్థాపించబడిన విశాల్ మెగా మార్ట్ ఒక హైపర్‌మార్కెట్ చైన్. కంపెనీకి దేశవ్యాప్తంగా దాదాపు 645 స్టోర్లను నిర్వహిస్తోంది. కంపెనీ తన స్టోర్ల ద్వారానే కాకుండా మెుబైల్ యాప్ ద్వారా కూడా మధ్య దిగువ మధ్య తరగతి ప్రజలను టార్గెట్ చేసుకుని వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికం నాటికి కంపెనీ దేశంలోని 28 రాష్ట్రాలతో పాటు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 414 ప్రదేశాల్లో స్టోర్లను కలిగి ఉంది. కంపెనీ తన స్టోర్లలో థర్డ్ పార్టీ బ్రాండ్ల ఉత్పత్తులను విక్రయిస్తోంది. స్టోర్లలో దుస్తులు, గృహోపకరణాలు, ప్రయాణ ఉపకరణాలు, కిచెన్ ఉపకరాలు, ఫుడ్, ఆహారేతర వస్తువులు, పచారీ సరుకులతో పాటు ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులను విక్రయిస్తోంది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications