రూ.4 లక్షల కోట్ల సంపద పెరిగింది, సెన్సెక్స్ 776 పాయింట్లు జంప్
స్టాక్ మార్కెట్లు మంగళవారం (ఏప్రిల్ 26) భారీ లాభాల్లో ముగిశాయి. వరుసగా రెండు రోజుల పాటు పతనమైన సూచీలు, ఈ రోజు తిరిగి పరుగు తీశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు, రోజంతా అదే జోరును కొనసాగించాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు మద్దతుగా నిలిచాయి. దీనికి తోడు రెండు సెషన్లలో నష్టాల కారణంగా కనిష్టాల వద్ద కొనుగోళ్లకు మొగ్గు చూపారు ఇన్వెస్టర్లు. చమురు ధరలు కాస్త దిగి రావడం కూడా కలిసి వచ్చింది.

సెన్సెక్స్ జంప్
సెన్సెక్స్ 57,066 పాయింట్ల వద్ద ప్రారంభమై, 57,442 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 56,904 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 776 పాయింట్లు లేదా 1.37 శాతం ఎగిసి 57,356 పాయింట్ల వద్ద ముగిసింది. నిప్టీ 246.85 పాయింట్లు లేదా 1.46 శాతం ఎగిసి 17,200.80 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ క్రితం సెషన్‌లో 56,580 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు ఓ సమయంలో 850 పాయిట్లకు పైగా ఎగిసింది. నిఫ్టీ 17,200 మార్కును క్రాస్ చేసింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
సెన్సెక్స్ 30 సూచీలో ఐదు షేర్లు మాత్రమే నష్టపోయాయి. యాక్సిస్ బ్యాంకు, మారుతీ సుజుకీ, టీసీఎస్, ఏషియన్ పేయింట్స్, విప్రో షేర్లు నష్టాల్లో ముగియగా, పవర్ గ్రిడ్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంకు, ఎల్ అండ్ టీ, ఎస్బీఐ, భారతీ ఎయిర్‌టెల్, సన్ ఫార్మా, హెచ్‌యూఎల్ నష్టాల్లో ముగిశాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్ నేడు 5.7 శాతం కూడా ఎగబాకింది.

రూ.4 లక్షల కోట్లు జంప్
వరుస రెండు రోజుల నష్టాలతో ఇన్వెస్టర్లు నష్టపోగా, నేడు అదే ఇన్వెస్టర్లు భారీగా లాభపడ్డారు. నేడు ఒక్కరోజే ఇన్వెస్టర్లు రూ.4.1 లక్షల కోట్ల సంపదను పెంచుకోగలిగారు. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.269.4 లక్షల కోట్లకు చేరుకుంది.


Click it and Unblock the Notifications