నిమిషాల్లో రూ.2.2 లక్షల కోట్ల సంపద పెరిగింది: సెన్సెక్స్, నిఫ్టీ జంప్
ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. నిన్న సెన్సెక్స్ 848 పాయింట్లు లాభపడి 49,580.73 క్రాస్ చేయగా, నిఫ్టీ 14,900 పాయింట్లు దాటింది. నేడు మరింతగా ఎగిసి సెన్సెక్స్ ఏకంగా 50,000 మార్కును, నిఫ్టీ 15,000 పాయింట్లను దాటింది. అంతర్జాతీయ మార్కెట్ నుండి సానుకూలతలు, దేశంలో రోజువారీ కరోనా కేసులు 3 లక్షల దిగువకు రావడం వంటి పరిణామాలు మార్కెట్‌కు కలిసి వచ్చింది. దీంతో వరుసగా రెండో రోజు మార్కెట్ జంప్ చేస్తోంది.

రూ.2.2 లక్షల కోట్లు జంప్
డొమెస్టిక్ ఈక్విటీ సూచీలు మంగళవారం భారీగా లాభపడటంతో ప్రారంభ 15 నిమిషాల్లోనే ఇన్వెస్టర్ల సంపద రూ.2.2 లక్షల కోట్లు ఎగిసింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.215.84 లక్షల కోట్లకు ఎగిసింది. ప్రారంభం నుండి సూచీలు అంతకంతకూ ఎగిశాయి. మధ్యాహ్నం గం.11.30 సమయానికి సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా లాభపడింది.

సూచీలు జంప్
సెన్సెక్స్ ఉదయం 49,580.73 పాయింట్ల వద్ద ప్రారంభమై, 50,295.08 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 49,959.20 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ మధ్యాహ్నం గం.11.30 సమయానికి సెన్సెక్స్ 632.68 (1.28%) పాయింట్లు లాభపడి 50,213.41 పాయింట్ల వద్ద కదలాడింది.
నిఫ్టీ 15,067.20 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,134.40 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,043.70 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.188.90 పాయింట్లు లాభపడి 15,110 పాయింట్ల వద్ద కదలాడింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి మధ్యాహ్నం సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్ 4.26 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 4.20 శాతం, టైటాన్ కంపెనీ 3.85 శాతం, బజాజ్ ఆటో 3.86 శాతం, హిండాల్కో 3.49 శాతం లాభపడ్డాయి.
నేటి టాప్ లూజర్స్ జాబితాలో భారతీ ఎయిర్ టెల్ 1.20 శాతం, యూపీఎల్ 0.30 శాతం, గ్రాసీమ్ 0.40 శాతం, కోల్ ఇండియా 0.30 శాతం, ఐటీసీ 0.24 శాతం ఉన్నాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో ఎస్బీఐ, టాటా స్టీల్, టాటా మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications