For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ఒక్కరోజు రూ.7 లక్షల కోట్లు, 2 నెలల్లో రూ.15 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హుష్‌కాకి

|

స్టాక్ మార్కెట్ ఈ వారం భారీగా పతనమైంది. అయిదు ట్రేడింగ్ సెషన్‌లలో నాలుగు సెషన్లు నష్టపోయింది. దీంతో ఇన్వెస్టర్లు ఈ వారం రూ.8.3 లక్షల కోట్లు నష్టపోయింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7 లక్షల కోట్లకు పైగా తగ్గింది. డిసెంబర్ 10వ తేదీన రూ.267.68 లక్షల కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ వ్యాల్యూ డిసెంబర్ 17వ తేదీ నాటికి రూ.259.4 లక్షల కోట్లకు తగ్గింది.

ఇక అక్టోబర్ నెల నుండి ఫారెన్ ఇన్వెస్టర్స్ వరుసగా మార్కెట్లో విక్రయాలకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ రెండు నెలల కాలంలో ఇన్వెస్టర్ల సంపద రూ.15.32 లక్షల కోట్లు క్షీణించింది. ఆ వారం సెన్సెక్స్ 1775 పాయింట్లు, నిఫ్టీ 526 పాయింట్లు పతనమైంది. ఓ సమయంలో 63,000కు సమీపంలో ఉన్న సెన్సెక్స్ ఇప్పుడు 57,000 పాయింట్ల స్థాయికి వచ్చింది.

Investors lost Rs 15.32 lakh crore due to selling in stock market in two months

ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. త్వరలో ఇది ప్రపంచ దేశాల్లో ప్రబలరూపకంగా మారే అవకాశముందనే అంచనాలు వెలువడుతున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. ఫెడ్ నాలుగు దశాబ్దాల గరిష్టాలకు చేరుకున్న తర్వాత ఉద్దీపనల ఉపసంహరణ దిశగా అడుగులు వేస్తోంది. ఈ పరిణామాలు అంతర్జాతీయ, దేశీయ మార్కెట్ పైన ప్రభావం చూపాయి. దీంతో సెన్సెక్స్ 889.40 (1.54%) పాయింట్లు నష్టపోయి 57,011.74 పాయింట్ల వద్ద, నిఫ్టీ 263.20 (1.53%) పాయింట్లు నష్టపోయి 16,985.20 పాయింట్ల వద్ద ముగిసింది.

English summary

ఈ ఒక్కరోజు రూ.7 లక్షల కోట్లు, 2 నెలల్లో రూ.15 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హుష్‌కాకి | Investors lost Rs 15.32 lakh crore due to selling in stock market in two months

There was a big fall in the stock market this week. In the trading session of 5 days, there was a decline in the market for four days.
Story first published: Friday, December 17, 2021, 21:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X