IPO News: మెుదటి రోజే ముంచేసిన ఐపీవో.. పాపం.. డబ్బులు కోల్పోయిన ఇన్వెస్టర్లు..!
IPO News: కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తర్వాత మార్కెట్లోకి వచ్చిన తొలి ఐపీవో దేశీయ ఇన్వెస్టర్లకు నిరాశను మిగిల్చింది. ఈ రోజు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో అడుగు పెట్టిన స్టాక్ ఐపీవో ధర కంటే తక్కువకు లిస్ట్ కావటంతో పెట్టుబడిదారులు నష్టాలపాలయ్యారు.
ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లలోకి వచ్చిన Avalon Technologies ఐపీవో ఇన్వెస్టర్లను నిరాశపరిచింది. ఈ క్రమంలో బీఎస్‌ఈలో కంపెనీ రూ.431 వద్ద లిస్ట్ అయ్యింది. ఉదయం 10.15 గంటలకు అవలోన్ టెక్నాలజీస్ షేర్లు లిస్టింగ్ ధర కంటే 1.16 శాతం తగ్గి రూ.426 వద్ద ట్రేడవుతున్నాయి. గంట తర్వాత కంపెనీ షేర్లలో మరింత క్షీణత కనిపించింది. ఆ తర్వాత అవలోన్ షేరు ధర మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో రూ.396.65 వద్ద ట్రేడవుతోంది. ప్రీ-ఓపెనింగ్ సెషన్‌లో కంపెనీ షేర్లు 5 శాతం వరకు క్షీణించాయి.

కంపెనీ షేర్ల పరిస్థితిపై స్వస్తిక్ ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ సీనియర్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ మాట్లాడుతూ.. కంపెనీ బలమైన, స్థిరమైన ఆర్థిక పరిస్థితులు కలిగి ఉందని వెల్లడించారు. అయితే పన్నుల తర్వాత ఆదాయాల్లో క్షీణత ఉందని తెలిపారు. పెట్టుబడుల విషయంలో ఎక్కువ రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్న ఇన్వెస్టర్లు షేర్లను దీర్ఘకాలిక పెట్టుబడిగా పరిగణనించవచ్చని సూచించారు.
వివరాల్లోకి వెళితే.. Avalon Technologies IPO ఏప్రిల్ 3, 2023న తెరవబడుతుంది. రిటైల్ పెట్టుబడిదారుల కోసం 6 ఏప్రిల్ 2023 వరకు తెరిచి ఉంది. కంపెనీ తన IPO కోసం ఒక్కో షేరు ధరను రూ.415 నుంచి రూ.436గా ప్రైస్ బ్యాండ్‌ను నిర్ణయించింది. ఒక్కో లాట్ లో రూ.2 ఫేస్ వ్యాల్యూ కలిగిన 34 షేర్లను కంపెనీ అందించింది.
సబ్‌స్క్రిప్షన్ చివరి రోజున ఐపీవో 2.34 సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. రిటైల్ కేటగిరీలో 0.88 రెట్లు, సంస్థాగత ఇన్వెస్టర్ల కేటగిరీలో 3.77 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కేటగిరీలో 0.43 రెట్లు సబ్‌స్క్రిప్షన్ పొందింది. అయితే నేడు మాత్రం మార్కెట్లో షేర్లు 9 శాతానికి పైగా నష్టంలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications