Sensex-Nifty: దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలటం నేడు భారతీయ స్టాక్ మార్కెట్లలో డబ్బులు పెట్టిన ఇన్వెస్టర్లకు కన్నీళ్లను మిగిల్చాయి. ప్రస్తుతం బేర్స్ గుప్పిట్లో మార్కెట్లు కొనసాగుతున్న వేళ పెట్టుబడిదారులు రూ.8.21 లక్షల కోట్లను నేడు కోల్పోయారు.
ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో బెంచ్‌మార్క్ సూచీ సెన్సెక్స్ 736 పాయింట్లు కోల్పోయి 73,508 పాయింట్లకు చేరుకుంది. నేడు మార్కెట్ల ఓపెనింగ్ తర్వాత ఇన్వెస్టర్ల నుంచి వెల్లువెత్తిన అమ్మకాల ఒత్తిడికి ఇరాన్-ఇజ్రాయెల్ టెన్షన్లు కారణంగా నిలిచాయని నిపుణులు వెల్లడించారు. ఇదే క్రమంలో మరో కీలక సూచీ అయిన నిఫ్టీ 234 పాయింట్లను కోల్పోయింది. మార్కెట్లో పెట్టుబడిదారుల సంపద విలువ రూ.399.67 లక్షల కోట్ల నుంచి రూ.391.46 లక్షల కోట్లకు క్షీణించింది.

ప్రధానంగా మార్కెట్ల పతనాన్ని కొనసాగించటానికి టాటా మోటార్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, ఎస్బీఐ కంపెల షేర్లు దోహదపడ్డాయి. ఇదే క్రమంలో బీఎస్ఈలో 20 షేర్లు తమ 52 వారాల కనిష్ఠ స్థాయికి పడిపోగా.. 70 కంటే ఎక్కువ కంపెనీల షేర్లు 52 వారాల గరిష్ఠాన్ని అందుకున్నాయి. ప్రధానంగా మార్కెట్లలోని 3,330 లిస్టెడ్ కంపెనీల కదలికలను పరిశీలిస్తే అత్యధికంగా 2812 కంపెనీలు ప్రస్తుతం నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. దీంతో దలాల్ స్ట్రీట్ మెుత్తానికి బేర్స్ చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. దిగజారుతున్న అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితులతో ఇన్వెస్టర్లు సైతం ముందస్తు అప్రమత్తతను పాటించటం కూడా మార్కెట్ల పతనానికి దోహదపడుతోంది.
నేడు మార్కెట్ల ఇంట్రాడేలో క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్, ఆటో రంగాలకు చెందిన షేర్లు టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి. దీనికి తోడు మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు సైతం భారీ పతనాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు శుక్రవారం నికర ప్రాతిపదికన రూ.8,027 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించగా.. తాత్కాలిక ఎన్‌ఎస్‌ఈ డేటా ప్రకారం దేశీయ ఇన్వెస్టర్లు రూ.6,341 కోట్ల షేర్లను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది.
More From GoodReturns

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications