రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నిన్నటి వరకు నాలుగు రోజుల పాటు సూచీలు ఎంత నష్టపోయాయో, నేడు ఒక్కరోజే ఆ మేరకు పతనమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ 200 రోజుల మూవింగ్ యావరేజ్ దిగువకు పడిపోయింది. సెన్సెక్స్ 1000 పాయింట్ల మేర పతనం కావడంతో ఇన్వెస్టర్లు నేడు ఒక్కరోజే రూ.6 లక్షల కోట్లు నష్టపోయారు.
ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ నిన్న రూ.251.72 లక్షల కోట్లకు తగ్గింది. సోమవారం నాటి మార్కెట్ క్యాప్‌తో పోలిస్తే ఇది రూ.5.67 లక్షల కోట్లకు పైగా తక్కువ. ఫిబ్రవరి 16వ తేదీన క్లోజింగ్ వ్యాల్యూ రూ.262.19 లక్షల కోట్లు. కాగా, నిన్నటి వరకు వరుసగా నాలుగు రోజుల పాటు నష్టాల్లో ముగియడం, నేడు సెన్సెక్స్ ఏకంగా 1000 పాయింట్లు పడిపోవడంతో ఈ కొద్ది సెషన్లలోనే ఇన్వెస్టర్లు రూ.10.46 లక్షల కోట్లు నష్టపోయారు.

సెన్సెక్స్ మధ్యాహ్నం గం.1 సమయానికి 972.77 పాయింట్లు లేదా 1.69 శాతం లాభపడి 56,708.39 పాయింట్ల వద్ద, నిఫ్టీ 296.20 పాయింట్లు లేదా 1.72 శాతం క్షీణించి 16,912.05 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ నేడు ఓ సమయంలో దాదాపు 1300 పాయింట్ల మేర క్షీణించింది. ఆ తర్వాత కాస్త కోలుకున్నప్పటికీ, భారీ నష్టాల్లోనే ట్రేడ్ అవుతోంది.
More From GoodReturns

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications