స్టాక్ మార్కెట్ నేడు (గురువారం, అక్టోబర్ 28) భారీగా నష్టపోయింది. సెన్సెక్స్ ఏకంగా 1158 పాయింట్లు, నిఫ్టీ 353 పాయింట్లు క్షీణించింది. గత ఆరు నెలల కాలంలో మార్కెట్‌లకు ఇది భారీ పతనం. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు భారీగా నష్టపోయాయి. గతవారం మొదటి సెషన్‌లో లాభపడ్డ మార్కెట్, తర్వాత నాలుగు సెషన్లు నష్టపోయింది. ఈ వారంలో మొదటి రెండు సెషన్లు లాభాల్లో ముగిసినప్పటికీ, తర్వాత వరుసగా రెండు సెషన్లు నష్టపోయింది. నేడు సెన్సెక్స్ 1,158.63 పాయింట్లు లేదా 1.89 శాతం నష్టపోయి 59,984.70 పాయింట్ల వద్ద ముగిసింది. ఏప్రిల్ 12 తర్వాత గరిష్టం ఇదే. నాడు 1708 పాయింట్లు నష్టపోయింది. అదే సమయంలో నిఫ్టీ 353.70 పాయింట్లు లేదా 1.94 శాతం నష్టపోయి 17,857.25 పాయింట్ల వద్ద ముగిసింది.

ఈ స్టాక్స్ పతనం
సెన్సెక్స్ ప్యాక్‌లో ఐటీసీ టాప్ లూజర్‌గా నిలిచింది. ఇది 5.54 శాతం క్షీణించింది. ఇటీవలి సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల్లో కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ అంచనాల కంటే 10.09 శాతం తక్కువగా నమోదయింది. దీంతో ఈ స్టాక్ పతనమైంది. ICICI బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, టైటాన్, SBI, HDFC బ్యాంకు కూడా భారీగా నష్టపోయాయి. ఇవి 4.39 శాతం వరకు నష్టపోయాయి. కేవలం ఆరు స్టాక్స్ మాత్రమే లాభాల్లో ముగిశాయి. ఇండస్ఇండ్ బ్యాంకు 2.94 శాతం లాభపడి టాప్ గెయినర్‌గా నిలిచింది. నెట్ ప్రాఫిట్ 73 శాతం పెరిగింది.

దలాల్ స్ట్రీట్ డమాల్
మార్కెట్ పతనానికి పలు కారణాలు ఉన్నాయి. కొద్ది రోజులుగా పలు కంపెనీలు సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించాయి. ఇందులో చాలా కంపెనీలు దలాల్ స్ట్రీట్ అంచనాలను అందుకోలేదు. ఇది ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ వంటి దిగ్గజ షేర్లలో లాభాల స్వీకరణ కనిపించింది. గత వారం కంటే ముంద మార్కెట్ పరుగులు తీసింది. ఈ వారం ప్రారంభం కూడా లాభాల్లోనే ఉంది. ఈ వారం ఆరంభం నుండే విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. అదే విధంగా దేశీయ ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. నేడు అక్టోబర్ డెరివేటివ్ కాంట్రాక్ట్ గడువు ముగుస్తుంది. సాధారణంగా ఈ రోజు ఆప్షన్స్ కాలవ్యవధి తీరనున్నది. అందుకే ఈ రోజు సెటిల్మెంట్ వాల్యూ కోసం అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. బ్యాంకింగ్ స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తి, బ్యాంకింగ్ సూచీ 40,000 మార్కు దిగువకు పడిపోయింది. అలాగే, అంతర్జాతీయ మార్కెట్ నుండి ప్రతికూల సంకేతాలు వచ్చాయి.

రూ.4.82 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది
సెన్సెక్స్ నేడు 1159 పాయింట్లు నష్టపోవడంతో ఇన్వెస్టర్ల సంపద రూ.4.82 లక్షల కోట్లు హరించుకుపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,60,48,949.80 కోట్లకు తగ్గింది. టాప్ టెన్ కంపెనీల్లో వరుసగా రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, ఐసీఐసీఐ బ్యాంకు, HDFC, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, కొటక్ మహీంద్రా బ్యాంకు ఉన్నాయి.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

నేడు స్టాక్ మార్కెట్‌లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications