40 ని.ల్లో రూ.3.4 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హుష్‌కాకి

దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం భారీ నష్టాల్లో ముగిసింది. నేటితో సూచీలు వరుసగా ఐదు రోజులు నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు, రోజంతా ఊగిసలాటలో కనిపించాయి. చివరి నలభై నిమిషాల్లో మాత్రం భారీగా పతనమయ్యాయి. చైనాలో కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా జిన్‌పింగ్ ప్రభుత్వం ఉపశమనాలు ప్రకటించింది. దీంతో ఆసియా-పసిఫిక్ మార్కెట్లు సానుకూలంగా కదలాడాయి. ఐరోపా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి.

దేశీయంగా ద్రవ్యోల్భణం, అమెరికా వడ్డీ రేట్ల పెంపు, ఉక్రెయిన్ - రష్యా యుద్ధ భయాలు, ఎఫ్ఐఐల నిష్క్రమణ, బాండ్స్ రాబడుల పెరుగుదల, చమురు ధరల పెరుగుదల వంటి అంశాలు సూచీలపై ప్రభావం చూపాయి. ఇవి ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. ఉదయం సెన్సెక్స్ 57,381 పాయింట్ల వద్ద ప్రారంభమై, 57,464 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 56,009 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 703.59 పాయింట్లు క్షీణించి 56,463 పాయింట్ల వద్ద, నిఫ్టీ 215 పాయింట్లు తగ్గి 16,958 పాయింట్ల వద్ద ముగిసింది.

 Investors lose Rs 3.4 lakh crore in 40 mins as market nosedives

సెన్సెక్స్ 30లో రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంకు మాత్రమే లాభాల్లో ముగిశాయి. హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐటీసీ, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, హిందూస్తాన్ యూనీలీవర్, కొటక్ మహీంద్రా, మారుతీ షేర్లు భారీగా నష్టపోయాయి. రిలయన్స్ స్టాక్ 3.7 శాతానికి పైగా లాభపడింది.

ఉదయం నుండి మధ్యాహ్నం 2.55 నిమిషాల వరకు ఊగిసలాటలో కనిపించిన మార్కెట్లు, పెద్దగా నష్టపోయినట్లుగా కనిపించలేదు. కానీ ఆ తర్వాత మాత్రం హఠాత్తుగా కుప్పకూలింది. దీంతో చివరి 40 నిమిషాల్లో ఇన్వెస్టర్లు రూ.3.4 లక్షల కోట్లు నష్టపోయారు. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.269.4 లక్షల కోట్ల నుండి రూ.266 లక్షల కోట్లకు తగ్గింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+